వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు విశాఖ ఝలక్: మంత్రి గంటాతో వైసీపీ కీలక నేత భేటీ!

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో విశాఖపట్నంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ నగర శాఖలో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు సోమవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు.

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్‌-32 విమానం గల్లంతు నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైసీపీ అధినేత వైయస్ జగన్ సోమవారం విశాఖపట్నానికి రానున్నారు. ఈ క్రమంలో మంత్రి గంటాతో దొరబాబు సమావేశం కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.

గ్రేటర్ విశాఖ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దొరబాబు మంత్రి గంటాతో భేట్ అయినట్లుగా తెలుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరతానని మంత్రి గంటా ముందు దొరబాబు ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ముందుగా దొరబాబు టీడీపీ నేతలతో భేటీ అయ్యారని, పార్టీ మారే విషయంలోనూ ఆ పార్టీ నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది.

మరోవైపు ఈరోజు విశాఖపట్నానికి వస్తున్న వైయస్ జగన్‌కు ఝలక్కించ్చేందుకే సోమవారం ఉదయం మంత్రి గంటాతో దొరబాబు భేటీ అయ్యారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం మధ్యాహ్నం 12.10 గంటలకు హైదరాబాద్‌ నుంచి విమానంలో విశాఖకు జగన్‌ చేరుకుంటారు.

నేరుగా 104 ఏరియాలోని భూపేంద్రసింగ్‌ ఇంటికి అనంతరం వరుసగా బుచ్చిరాజుపాలెంలో ఎన్‌.చిన్నారావు, గోపాలపట్నంలో పి.నాగేంద్రరావు, వేపగుంటలో జి.శ్రీనివాసరావు, అప్పన్నపాలెంలో బి.సాంబమూర్తి, మాధవధార కళింగనగర్‌లో ఆర్‌వి ప్రసాద్‌బాబు నివాసాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌ బయల్దేరుతారు.

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్


అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌కు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కార్పోరేటర్లు సైతం ఆకర్షితులవుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం విజయవాడ మున్సిపల్ కార్పోరేష‌న్‌కు చెందిన వైసీపీ కార్పోరేటర్ లలితకుమారి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అధ్వర్యంలో టీడీపీ తీర్దం పుచ్చుుకున్నారు.

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెకు పచ్చకండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ అభివృద్ధి దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకెళ్తున్నాయని అన్నారు.

 టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్

విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వైసీపీ కార్పోరేటర్‌ లలితకుమారి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ నగరంలో రూ.4వేల కోట్ల నిధులతో దుర్గగుడి వంతెన, బెంజి సర్కిల్‌లో ఫ్లైఓవర్‌, బందరుకు నాలుగు లైన్ల రహదారి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్

టీడీపీలో చేరిన విజయవాడ వైసీపీ కార్పోరేటర్


వైసీపీలో ఉంటే అవినీతి ముద్ర తప్ప అభివృద్ధి సాధ్యం కాదని నేతలు భావిస్తున్నారని.. అందువల్లే టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితమయ్యే టీడీపీలో కి వచ్చినట్లు కార్పోరేటర్‌ లలితకుమారి తెలిపారు.

English summary
Visakhapatnam deputy mayor dorababu met minister ganta srinivasa rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X