విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో విశాఖ ధనిక సిటీ: బాబు కుప్పం కంటే జగన్ పులివెందుల బెస్ట్

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో విశాఖలోని గాజువాక అత్యధిక ధనిక అసెంబ్లీ నియోజకవర్గంగా నిలిచింది. తద్వారా ఏపీలో విశాఖ టాప్ లిస్ట్‌లో ఉంది. ఇక్కడ తలసరి ఆదాయం రూ.2,64,332గా ఉంది.

అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గం తలసరి ఆదాయంలో అన్ని నియోజకవర్గాల కంటే వెనుక నిలిచింది. ఇక్కడ తలసరి ఆదాయం రూ.46,905గా ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి 175 నియోజకవర్గాలలో.. ఆయా నియోజకవర్గాలలో తలసరి ఆదాయాన్ని అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో గాజువాక ధనిక నియోకవర్గంగా మొదటి స్థానంలో ఉండగా, ఇచ్చాపురం చివరి స్థానంలో నిలిచింది.

Visakhapatnam tops list of richest cities in Andhra Pradesh

గాజువాక - తలసరి ఆదాయం రూ.2,64,332, కృష్ణా జిల్లా - తలసరి ఆదాయం రూ.1,22,773, కాకినాడ - రూ. తలసరి ఆదాయం 1,22,439, తిరుపతి - తలసరి ఆదాయం రూ.1, 00,935, నెల్లూరు - తలసరి ఆదాయం రూ.86, 868, విజయనగరం - తలసరి ఆదాయం రూ.76,623, కుప్పం- తలసరి ఆదాయం రూ.61,115, ఇచ్ఛాపురం - తలసరి ఆదాయం రూ.46,905గా ఉన్నాయి.

విశాఖ జిల్లాలో తలసరి ఆదాయం సరాసరి రూ.1,24,171గా ఉంది. కృష్ణా జిల్లా రూ.1,22,773తో రెండో స్థానంలో ఉంది. విజయనగరం జిల్లా సరాసరి రూ.76,623తో చివరి స్థానంలో ఉంది. చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నియోజకవర్గం కుప్పం చివరి స్థానంలో ఉంది.

ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నియోజక వర్గం పులివెందుల.. కడప జిల్లాలో చాలా వాటి కంటే బాగుంది. ఇక్కడ తలసరి ఆదాయం రూ.1 లక్షగా ఉంది.

English summary
As part of its plan to chalk out development strategies at the assembly segment level, the Andhra Pradesh government has estimated per capita income (PCI) of its assembly constituencies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X