వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వడ్డీ మహేష్ సమాచారం: 3 రాష్ట్రాల్లో 54 కంపెనీలపై దాడులు

ఉత్తరాంధ్రలో సంచలనం రేపిన హవాలా కుంభకోణంలో అరెస్టయిన వడ్డీ మహేష్ ఇచ్చిన సమాచారంతో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో బినామీ కంపెనీల పైన ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఉత్తరాంధ్రలో సంచలనం రేపిన హవాలా కుంభకోణంలో అరెస్టయిన వడ్డీ మహేష్ ఇచ్చిన సమాచారంతో ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. మూడు రాష్ట్రాల్లో బినామీ కంపెనీల పైన ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

రూ.1500 కోట్ల స్కాం: వారెవరో తెలియదు... చేతులెత్తేసిన వడ్డీ మహేష్ రూ.1500 కోట్ల స్కాం: వారెవరో తెలియదు... చేతులెత్తేసిన వడ్డీ మహేష్

ఇప్పటికే అరెస్టైన మహేష్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో పలుచోట్ల సోదాలు చేస్తున్నారు. 54 కంపెనీలపై దాడులు జరిగాయి. విశాఖ, శ్రీకాకుళం, చెన్నై తదితర ప్రాంతాల్లో జరిగాయి.

లేని కంపెనీలు సృష్టించి

లేని కంపెనీలు సృష్టించి

లేని కంపెనీలను సృష్టించి హవాలా ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన స్కాం ఇటీవల ఉత్తరాంధ్రలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో కీలక నిందితుడు వడ్డీ మహేష్‌ను పోలీసులు అరెస్టు చేసారు. అతని నుంచి సమాచారం రాబడుతున్నారు.

విదేశాల్లో కేసు మూలాలు

విదేశాల్లో కేసు మూలాలు

హవాలా రూపంలో పెద్ద ఎత్తున నగదును విదేశాలకు తరలించి ఈ కేసు దర్యాఫ్తును ఇప్పటికే సీబీఐకి అప్పగించినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. కేసు మూలాలు విదేశాల్లో ఉన్నందున దర్యాఫ్తు తమకు భారమనే భావనతో సీఐడీకి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు?

మహేష్‌కు ముగ్గురు వ్యాపారులు డబ్బులు ఇచ్చినట్లు ఆయననే స్వయంగా తెలిపారు. అయితే వారు ఎవరు, ఆ డబ్బును ఎవరి ఖాతాలకు తరలించారనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు. వారి వెనుక ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే దర్యాఫ్తుకు ఆటంకం కలుగుతుందన్న అనుమానంతో పేర్లు వెల్లడించలేదు.

విదేశాలకు వెళ్లి దర్యాఫ్తు

విదేశాలకు వెళ్లి దర్యాఫ్తు

గత మూడేళ్లలో రూ.569.93 కోట్లు విదేశాలకు తరలించినట్లు మహేష్ విచారణలో ఇప్పటికే వెల్లడించారు. కానీ ఐటీ అధికారులు మరో రూ.800 కోట్ల వరకు విదేశాలకు తరలించాడని చెప్పారు. విదేశాలకు వెళ్లి దర్యాఫ్తు చేయాల్సి ఉంది.

English summary
Rs 570 crore hawala scam unearthed in Visakhapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X