అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంపాదనే లక్ష్యమా: బాబుపై బిజెపి విష్ణు, జగన్ ఇప్పుడేం చెప్తారు.. లోకేష్

చంద్రబాబు ప్రభుత్వంపై మిత్రపక్షం బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వానికి సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోందన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంపై మిత్రపక్షం బిజెపి శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యం పాలసీ లోపభూయిష్టంగా ఉందని, ప్రభుత్వానికి డబ్బు సంపాదనే లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపించారు.

చదవండి: 'పవన్ కళ్యాణ్, మోడీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు'

విశాఖపట్టణంలోని మాధవధార, కళింగనగర్, కైలాసపురంలో మద్యం షాపులకు వ్యతిరేకంగా నిర్వహించిన స్థానికుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా విష్ణుమాట్లాడారు. జనావాసాల మధ్య వైన్ షాపులు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.

Vishnu Kumar Raju slams government on liquor issue

మద్యం షాపులకు దేవుడి పేర్లు పెట్టొద్దని నిర్ణయం

ఏపీ కేబినెట్లో సోమవారం మద్యం షాపులపై చర్చించినట్లు మంత్రి జవహర్ చెప్పారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. కొత్త మద్యం పాలసీ ఇబ్బందులపై చర్చించామన్నారు. మహిళల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామన్నారు.

మద్యం షాపులు జనావాసాలకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే దేవుడి పేర్లు పెట్టవద్దని నిర్ణయించామన్నారు. రేపు కొత్త నిబంధనలపై జీవో విడుదల చేస్తామన్నారు. 8 రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలు ఏపీలో అమలు చేస్తామన్నారు.

చదవండి: అడవిలో.. బురదలో నడిచి: ఆ యాత్రలో జగన్ పెద్ద రిస్క్ ఇలా..!

మీడియాతో లోకేష్ చిట్ చాట్

కేబినెట్ భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. సదావర్తి భూములపై మేం చెప్పినట్లుగానే రూ.5 కోట్లు ఎక్కువ చెల్లించి భూములు దక్కించుకోవాలని కోర్టు చెప్పిందని లోకేష్ అన్నారు.

ఇప్పుడు వైసిపి కోర్టు తీర్పుపై ఏం చెబుతుందని నిలదీశారు. ఐటీ సంస్థల కోసం భవన నిర్మాణాల్లో మార్పులు చేయాలన్నారు. లక్ష ఉద్యోగాలకు కోటి చదరపు అడుగుల స్థలం కావాలన్నారు.

English summary
BJPLP Vishnu Kumar Raju lashed out at Chandrababu Naidu government on liquor issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X