వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"విశాఖ బ్రాండ్‌కు దెబ్బ.. దోచేసుకున్నారు.. బాబు, లోకేష్ కనుసన్నుల్లోనే!"

విశాఖ భూకుంభకోణంపై బుధవారం నాడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖలో లక్షల ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారని అన్నారు.

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: స్టీల్ సిటీగా పేరు గాంచిన విశాఖ నగరాన్ని స్టోలెన్ సిటీగా మార్చారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖ భూఆక్రమణల్లో 2లక్షల ఎకరాల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఇంతకుముందు ఆరోపించినట్లుగానే.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేషన్ కను సన్నుల్లోనే ఈ వ్యవహారం నడిచిందని విజయసాయి రెడ్డి మరోసారి ఆరోపించారు,

<strong>లోకేష్ డైరెక్షన్ లోనే విశాఖ భూదందా!.. ఏకమై తరిమి కొట్టాల్సిందే: బొత్స</strong>లోకేష్ డైరెక్షన్ లోనే విశాఖ భూదందా!.. ఏకమై తరిమి కొట్టాల్సిందే: బొత్స

విశాఖ భూకుంభకోణంపై బుధవారం నాడు విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. విశాఖలో లక్షల ఎకరాలను టీడీపీ నాయకులు ఆక్రమించారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నగరం దోపిడీకి గురైన నగరంగా మిగిలిపోయిందన్నారు. విశాఖలో ఇటీవల జరిగిన సదస్సు పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ కాదని, సెటిల్ మెంట్ సమ్మిట్, కబ్జాల సమ్మిట్ అని దుయ్యబట్టారు.

vizag land scam: vijayasai reddy allegations chandrababu and lokesh

భూఆక్రమణలపై ప్రభుత్వం చేయిస్తున్న సిట్ విచారణ తూతూ మంత్రంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వ వ్యక్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆరోపణలున్నప్పుడు సర్కార్ నియమించిన సిట్ విచారణ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ జరిపితేనే దోషులు బయటకు వస్తారని పేర్కొన్నారు.

<strong>మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..</strong>మనుషులా? పశువులా?: భూదందాపై కడిగేసిన అయ్యన్న!, కంగు తిన్న మంత్రులు..

విశాఖ భూఆక్రమణల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందన్నారు. గంటాతో పాటు ఆయన బావమరిది భాస్కరరావు, గంటా అల్లుడు ప్రశాంత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, పీలా గోవింద్‌, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్ బాబు, అనిత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ప్రమేయం ఉందని ఆరోపించారు. టీడీపీ నాయకుల భూకబ్జాలకు తాము వ్యతిరేకంగా పోరాడతామన్నారు.

చట్ట వ్యతిరేకంగా భూకబ్జాలకు పాల్పడినవారిని ఎట్టి పరిస్థితుల్లోనే వదిలేది అని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.2019తర్వాత ఇప్పటి ఆక్రమణదారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకుంటామన్నారు.ఇక బ్రాహ్మణ్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ ను తొలగించడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిందన్నారు.

English summary
YSRCP Rajyasabha member Vijayasai Reddy demanded for CBI probe regarding Vizag land scam issue. He alleged Chandrababu was behind the scam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X