వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: శివారు భూములపై కన్నేసి, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, లక్షల్లో ముంచేసిన మోసగాడిని ఆనందపురం పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నగర శాంతి భద్రతల డీసీపీ త్రివిక్రమవర్మ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

ఆనందపురం మండలం కుసులపూడి గ్రామానికి చెందిన యర్రా ఈశ్వరరావు అలియాస్ ఈశ్వరనాయుడు ఈ మాయాజాలానికి సూత్రధారి. గురువారం అరెస్టయిన అతని నుంచి ఇన్నోవా కారు, పాస్ పోర్టులు, పాన్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు


ఆనందపురం మండలంలో సర్వే నెంబర్ 132/13లో తమ 86 సెట్ల భూమిని నిర్మల అప్పాయమ్మ, మీసాల అప్పాయమ్మ 1974లో మీసాల అప్పన్నకు విక్రయించారు. అతని నుంచి 2006లో పాలకుర్తి మురళీ కృష్ణ, పెదపాటి రవిమోహన్ చెరో 43 సెంట్లు కొనుక్కున్నారు.

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు


ఆ తర్వాత 2014లో ఆ భూమిని అప్పలరాజు, రమణ, నిరంజన్‌‌లకు అమ్మారు. నిందితుడు యర్రా ఈశ్వరరావు 2015లో తయారు చేసిన నకిలీ డాక్యుమెంట్లతో ఆ స్ధలాలు తనవని చెప్పి ఆక్రమించుకోవడంతో బాధితులు ముగ్గురూ ఆనందపురం స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

పోలీసుల విచారణలో 2015 ఏప్రిల్‌లో నిమ్మల వెంకటరమణ నుంచి కొనుకున్నట్టు ఈశ్వర్ రావు ఒక డాక్యుమెంట్ చూపించాడు. అది అబద్ధమని తేలింది. మరో కేసులో సర్వే నెంబర్ 128/14లో 23 సెంట్లు, 128/11లో మరో 4 సెంట్ల భూమిని 1991లో మీసాల రాము, మీసాల అప్పన్నకు విక్రయించాడు.
 నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

నకిలీ డాక్యుమెంట్లతో భూములు కాజేసిన మోసగాడు

2003లో అప్పన్న నుంచి ఆదినారాయణ, 2008లో అతని నుంచి పెతకం శెట్టి రామలక్ష్మీ ఈ స్థలం కొనుకున్నారు. ఆ భూమిని కూడా 2014లో నిమ్మల వెంకటరమణ పేరిట రిజిస్టేషన్ చేసి ఉండటం విశేషం. రామలక్ష్మీ ఈ వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా యర్రా ఈశ్వరరావుపై 13 కేసులు నమోదయ్యాయి.

English summary
Vizag police bust fake certificate racket; one man arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X