వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు ముందే హెచ్చరిక: శిల్పా గెలుపు చార్ట్, ప్రశాంత్ కిషోర్ సర్వేలోనూ..

నంద్యాల ఉప ఎన్నికలపై ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. తాము గెలుస్తామంటే, తాము గెలుస్తామని వైసిపి, టిడిపి నేతలు చెబుతున్నారు. అలాగే, పలువురు నంద్యాల ఉప ఎన్నికలలో పోలింగ్‌కు ముందు, తర్వాత సర్వే చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలపై ఎవరి లెక్కలు వారు వేస్తున్నారు. తాము గెలుస్తామంటే, తాము గెలుస్తామని వైసిపి, టిడిపి నేతలు చెబుతున్నారు. అలాగే, పలువురు నంద్యాల ఉప ఎన్నికలలో పోలింగ్‌కు ముందు, తర్వాత సర్వే చేశారు.

తన సర్వేలో టిడిపి గెలుస్తుందని తేలిందని విజయవాడ మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అలాగే, వైసిపి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వైసిపి ఐదారు వేల మెజార్టీతో బయటపడుతుందని తేలిందని సమాచారం.

నంద్యాల ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ

నంద్యాల ఉప ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి - వైసిపిలు హోరాహోరీగా తలపడ్డాయి. ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొంది. గెలుపు విషయంలో ఇరువర్గాలు సమానంగానే కనిపిస్తున్నాయి. ఎవరు ఓడినా, గెలిచినా స్వల్ప మెజార్టీ మాత్రమే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Recommended Video

Nandyal By-Election : Silpa Mohan Reddy High Chances Of Winning | Oneindia Telugu
గెలుపుపై ఇరు పార్టీలు ఇలా

గెలుపుపై ఇరు పార్టీలు ఇలా

గెలుపు విషయంలో రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బయటకు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి లోలోన పార్టీల్లోను ఆందోళన ఉంది. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు కనిపించిన ఉత్సాహం పోలింగ్ తర్వాత వైసిపిలో కనిపించడం లేదు. టిడిపిలో మాత్రం కొంచెం గెలుపు ఉత్సాహం కనిపిస్తోంది. కానీ పూర్తిగా ఎవరిలోను ధీమా కనిపించడం లేదు.

ఓటరు నాడి అర్థం కావడం లేదా

ఓటరు నాడి అర్థం కావడం లేదా

నంద్యాల నియోజకవర్గంలో గోస్పాడు, నంద్యాల రూరల్ మండలాల్లో ఎక్కువ పోలింగ్ జరిగింది. ఇక్కడ జగన్ పట్ల సానుకూలత వ్యక్తమైందని కొందరు అంటుంటే, అదేం లేదని మరికొందరు చెబుతున్నారు. అయితే ఓటర్ల నాడీ మాత్రం కచ్చితంగా ఎవరికీ దొరకడం లేదని అంటున్నారు.

ఓ చార్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్

ఓ చార్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్

ఉప ఎన్నికల్లో నంద్యాలలో ఎవరెవరు ఎవరికి ఓటు వేస్తారో.. ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎంవోకు ఓ నివేదిక ఇచ్చాయంటూ, అది ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ చార్ట్ సర్క్యులేట్ అవుతోంది. ఈ చార్ట్‌ను చూస్తే శిల్పా మోహన్ రెడ్డి స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయని అందులో తేలిందని అంటున్నారు.

ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీనే

ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీనే

ఉప ఎన్నికలకు ముందు సర్వేలు చేశారు. కానీ అవి ప్రసారం కాకుండా ఈసీ ఆపేసింది. పేరున్న సంస్థలు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించలేదు. కాబట్టి ఫలితంపై ఎవరూ పెద్దగా చెప్పడం లేదు. టిడిపి తక్కువ మెజార్టీతో గెలుస్తుందని లగడపాటి చెప్పగా, వైసిపినే తక్కువ మెజార్టీతో గెలుస్తుందని వైసిపి సర్వేలో తేలిందని అంటున్నారు.

చార్ట్ ప్రకారం..

చార్ట్ ప్రకారం..

సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న చార్ట్ ప్రకారం.. ముస్లీంలు, ఎస్టీ, వైశ్య, బలిజ, వాల్మీకి తదితరులు ఎక్కువగా టిడిపి వైపు మొగ్గు చూపగా, మాల, మాదిగ, రెడ్డి, యాదవ్ తదితరులు వైసిపి వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా ఉంది. ఈ లెక్కన టిడిపి కంటే వైసిపి నాలుగైదు వేల ఓట్లతో నెగ్గుతుందని అందులో పేర్కొన్నారు. అయితే,

English summary
A high voter turnout of about 80 per cent was on Wednesday recorded in the by-election to Nandyal Assembly constituency in Kurnool district of Andhra Pradesh, where the ruling TDP and opposition YSR Congress or YSRC are locked in a fierce battle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X