అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు': చంద్రబాబుకు వార్నింగ్

చేనేత కార్మిక నేతలు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను చూపించి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు జారీ చేశారు. తమ వెనుక పవన్ ఉన్నారని, ఆయన కోటి మందితో సమానమని చెప్పారు.

|
Google Oneindia TeluguNews

గుంటూరు: చేనేత కార్మిక నేతలు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను చూపించి.. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు హెచ్చరికలు జారీ చేశారు. తమ వెనుక పవన్ ఉన్నారని, ఆయన కోటి మందితో సమానమని చెప్పారు.

మంగళగిరిలో జరిగిన చేనేత సత్యాగ్రహ దీక్షలో పవన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూర్తి అనే చేనేత నాయకుడు మాట్లాడారు. పవన్ తమ పక్కన ఉంటే కోటి మంది తమను సమర్థించినట్లే అన్నారు.

<strong>హోదా టు వారసత్వం.. నాయకుడంటే, చెప్పీ చెప్పీ: పవన్ కౌంటర్ ఇలా</strong>హోదా టు వారసత్వం.. నాయకుడంటే, చెప్పీ చెప్పీ: పవన్ కౌంటర్ ఇలా

సభ సక్సెస్ అవ్వకుండా ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలంటే ఎవరైనా రూ.పది కోట్లు, రూ.20 కోట్లు తీసుకునే సమయంలో.. పవన్ స్వయంగా వచ్చి చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని చెప్పడం ఆనందమన్నారు.

 Warning to Chandrababu Naidu with the name of Pawan Kalyan

మా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పారు. పవన్ కోటి మందితో సమానమని చెప్పారు. కొందరు పవన్‌కు ఏమీ తెలియదని మాట్లాడుతుంటారని, మరి ఆయన మద్దతు ఎందుకు తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

<strong>చంద్రబాబుకు 'రాజధాని ప్లాట్ల' షాక్: పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు</strong>చంద్రబాబుకు 'రాజధాని ప్లాట్ల' షాక్: పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు

కాగా, ఇప్పటికే పలు సమస్యల పైన పవన్ కళ్యాణ్ స్పందిస్తోన్న విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నుంచి నేడు చేనేత వరకు పలు సమస్యలపై జనసేనానీ స్పందిస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ప్రతిస్పందిస్తోంది.

English summary
Chenetha leaders warned Chandrababu Naidu with the name of Jana Sena chief Pawan Kalyan on Monday in Mangalagiri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X