నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తటస్థం: నంద్యాల ఉపఎన్నికపై తేల్చేసిన పవన్, ఏమన్నారంటే..?(వీడియో)

నంద్యాల ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాము నంద్యాల ఉప ఎన్నికలో తటస్థంగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాము నంద్యాల ఉప ఎన్నికలో తటస్థంగా ఉంటామని పవన్ స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్ తన ఫేస్‌బుక్ వీడియో పోస్టు ద్వారా వెల్లడించారు.

అప్పటి వరకు పోటీ చేయం

అప్పటి వరకు పోటీ చేయం

తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని పవన్ చెప్పారు. ఎవరికో మేము మద్దిస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని ఈ సందర్భంగా పవన్ కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగే వరకు తాము పోటీ చేయమని స్పష్టం చేశఆరు. 2019 ఎన్నికల వరకు ఏ ఎన్నికలు జరిగినా పోటీ చేయమని చెప్పారు.

మద్దతు ఇవ్వడం లేదు..

మద్దతు ఇవ్వడం లేదు..

అందుకే కాకినాడ ఎన్నికల్లోనూ తాము పోటీ చేయలేదని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికలో ఏ పార్టీకి, ఏ అభ్యర్థిక జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. ప్రజల్లో మద్దతు ఉన్నప్పటికీ నంద్యాలలో ఉప ఎన్నిక కాబట్టి తాము పోటీ చేయడం లేదని, తటస్థంగా ఉంటున్నామని తెలిపారు.

<strong>‘వన్ఇండియా'కే మా మద్దతు: పాక్‌ను ఏకేసి, భారత్ గొప్పతనంపై పవన్(వీడియో)</strong>‘వన్ఇండియా'కే మా మద్దతు: పాక్‌ను ఏకేసి, భారత్ గొప్పతనంపై పవన్(వీడియో)

ఆ వార్తలను నమ్మవద్దు..

నంద్యాలలో గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నామని, తమ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఉపఎన్నికలో తటస్థంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తాను ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మవద్దని ఆయన తెలిపారు.

2019లో గట్టి పోటీనే..

2019లో గట్టి పోటీనే..

2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్.. నంద్యాల ఉపఎన్నికలో కూడా ఆ పార్టీకి మద్దతు తెలుపుతారని టీడీపీ భావించినప్పటికీ పవన్ నిర్ణయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీన్ని బట్టి చూస్తే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా జనసేన గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
Janasena Party president Pawan Kalyan on Wednesday said that their party will neutral in Nandyal Bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X