వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త రాష్ట్రం అండగా ఉండండి, బడ్జెట్‌లోగా బకాయిలు: ఈటెల

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది కాబట్టి అండగా ఉండాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో అరుణ్ జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఆర్ధిక సమావేశానికి ఆయన హాజరయ్యారు.

అనంతరం మంత్రి ఈటెల విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థుల అవసరార్థం బియ్యం మరింత పెంచాలని కేంద్రాన్ని కోరినట్టు వెల్లడించారు. దేశంలో గొప్పగా నడిచే వసతిగృహాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని, జనవరి 1నుంచి రాష్ట్రంలోని వసతి గృహాలకు సన్నబియ్యం అందిస్తామని వెల్లడించారు.

We are ready to supply fine rice to hostels says Etela Rajendar

కొత్త రాష్ట్రం కాబట్టి, రాష్ర్టానికి రావాల్సిన బకాయిలను బడ్జెట్‌లోగా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. తెలంగాణ సమస్యలపై ప్లానింగ్ కమిషన్‌కు వివరించామని పేర్కొన్నారు.

కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్‌తో మంత్రి ఈటెల భేటీ

కేంద్ర రైల్వే బోర్డు చైర్మన్ అరుణేంద్రకుమార్‌తో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ వినోద్‌తోపాటు డిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్రుడు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

English summary
We are ready to supply fine rice to hostels says Etela Rajendar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X