వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంద్‌కు మద్దతు, సీమకు రూ.1000 కోట్లివ్వాలి: టీజీ వెంకటేష్‌, బాబుపై నెహ్రూ ఫైర్

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఆగస్టు 11న జరిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు రాయలసీమ, ఉత్తరాంధ్ర హక్కుల ఐక్యవేదిక సంపూర్ణ మద్దతిస్తుందని మాజీ మంత్రి, టిడిపి నేత టీజీ వెంకటేష్‌ అన్నారు. రాయలసీమ కరువు నివారణకు తక్షణమే రూ.1000 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం జలాలపై తప్పుడు లెక్కలు చూపిన అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని టీజీ వెంకటేష్ ప్రశ్నించారు.

TG Venkatesh

కృష్ణా డెల్టా ఎడారిగా మారడానికి చంద్రబాబే కారణం

కృష్ణా: ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పంతాలకు పోవడం వల్లే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం తగ్గిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను కాంగ్రెస్ పార్టీ నేతలు దేనినేని నెహ్రూ, మల్లాది విష్ణు, కడియాల బుచ్చిబాబుల బృందం పరిశీలించింది.

కృష్ణా డెల్టా ఎడారిగా మారడానికి సీఎం చంద్రబాబే కారణమని నెహ్రూ ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్టులో అక్రమాలను త్వరలోనే బయటపెడతామని ఆయన అన్నారు. ఆగస్టు 20న పట్టిసీమ వరకు బస్సుయాత్ర చేస్తామని మల్లాది విష్ణు ప్రకటించారు.

ప్రత్యేక హోదా రాకుండా బిజెపి, టిడిపి కుట్ర

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, తెలుగుదేశం కుట్ర పన్నుతున్నాయని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక హోదా బస్సు యాత్ర శుక్రవారం తిరుపతి చేరుకుంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

English summary
Former minister and Telugudesam leader TG Venkatesh on Friday said that they will support Andhra Pradesh bandh programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X