హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ట్రూత్‌ఫుల్ గ్లోబల్ సిటీ: ‘డ్రైవర్ కమ్ ఓనర్’ ప్రారంభించిన కెసిఆర్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ట్రూత్ ఫుల్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. శుక్రవారం డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజాలో 303 క్యాబ్స్‌ను డ్రైవర్లకు అందజేశారు. వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కొత్తగా క్యాబ్స్ తీసుకుంటున్న డ్రైవర్లకు శుభాకాంక్షలు చెప్పారు. త్వరలోనే మరో 600 కార్లను అందిస్తామని తెలిపారు. హైదరాబాద్ పేరుకే మహానగరమైనా.. అనుకున్న సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను చూసి అబ్బురపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను ఊహించినంతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ ఐటీ సదస్సు 2018లో హైదరాబాద్‌లోనే జరుగుతుందని తెలిపారు. కేంద్రం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఉపాధి, ఉద్యోగ రంగాల్లో యువతకు అవకాశాలను కల్పించడానికి స్కిల్ డెవలప్‌మెంట్ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కేటాయించాలని సిఎం కెసిఆర్‌ను కోరారు.

ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగు నిధులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎంలు మహమూద్ అలీ, రాజయ్య, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ట్రూత్ ఫుల్ గ్లోబల్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

శుక్రవారం డ్రైవర్ కమ్ ఓనర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పీపుల్స్ ప్లాజాలో 303 క్యాబ్స్‌ను డ్రైవర్లకు అందజేశారు. వాహనాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

కెసిఆర్

కెసిఆర్

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ.. కొత్తగా క్యాబ్స్ తీసుకుంటున్న డ్రైవర్లకు శుభాకాంక్షలు చెప్పారు. త్వరలోనే మరో 600 కార్లను అందిస్తామని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్ పేరుకే మహానగరమైనా.. అనుకున్న సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను చూసి అబ్బురపడేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను ఊహించినంతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు.

కెసిఆర్

కెసిఆర్

ప్రపంచ ఐటీ సదస్సు 2018లో హైదరాబాద్‌లోనే జరుగుతుందని తెలిపారు.

కెసిఆర్

కెసిఆర్

కేంద్రం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే దానికి కావాల్సిన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.

English summary
Telangana CM K Chandrasekhar Rao on Friday said that they will develop Hyderabad as Truthful global city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X