వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పై విమర్శలను మానుకొన్న బిజెపి నేత వ్యూహమేమిటీ ?

By Narsimha
|
Google Oneindia TeluguNews

గుంటూరు ఎపి లో చంద్రబాబునాయుడు పాలన తీరు తెన్నులపై ఒంటికాలిపై లేచే బిజెపి సీనియర్ నాయకుడు సోము వీర్రాజు కొంత కాలంగా మౌనముద్రలో ఉన్నారు.ఎపిలో అధికార టిడిపికి బిజెపి మిత్రపక్షంగా ఉంది.ప్రభుత్వం అనుసరించే ప్రజ వ్యతిరేక విధానలపై సోము వీర్రాజు కొన్ని సందర్భాల్లో ఒ:టికాలిపై లేచారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడ కొన్ని సందర్భాల్లో అలాంటి విమర్శలు చేయలేదు. మిత్రపక్షమైనప్పటికీ...ప్రజా వ్యతిరేక విధానాలను ఉతికి ఆరేశారాయన.కాని...ఇటీవల కాలంలో ప్రభుత్వ విధానాలపై వీర్రాజు మౌనంగా ఉంటున్నారు.

ఎపి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్య పార్టీ గా ఉంది. త్వరలోనే మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణ చేయాలని ఎపి సిఎం చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.పునర్వవ్యవస్థీకరణలో ప్రస్తుత మంత్రుల్లో కొందరికి స్థానభ్రంశం తప్పకపోవచ్చు.బిజెపిలో కూడ కొందరికి అవకాశం దక్కనుందనే ప్రచారం సాగుతోంది.అయితే తమకు కూడ అవకాశం ఉంటుందనే అభిప్రాయంతో బిజెపిలో ఆశవాహాులు ఎదురుచూస్తున్నారు.

ఎపి సిఎం చంద్రబాబునాయుడు అవలంభించిన విధానలపై ఒంటికాలిపై విమర్శలు చేసిన బిజెపి నాయకుడు సోము వీర్రాజు ఇటీవల కాలంలో కొంత మౌనంగా ఉన్నారు. అంతేకాదు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నాలను ప్రారంభించారు. వెలగపూడిలో సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎపి సిఎం చంద్రబాబుకు పూల బోకే ఇచ్చి మరీ స్వాగతం పలికారు.మంత్రివర్గంలో చోటు కోసం వీర్రాజు బాబు వద్ద మార్కులు కోట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి వర్గాల్లో చర్చ సాగుతోంది.

somu veerraju

బాబు విధానలపై వీర్రాజు తో పాటు గొంతు కలిపిన బిజెపి నేతలు మాత్రం వీర్రాజు వైఖరి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.బాబుకు వ్యతిరేకంగా తమపై ముద్ర పడడం వల్ల నామినేటేడ్ పదవుల విషయంలో ఇబ్బంది కలుగుతోందనే భావనతో ఉన్నారు.ఎపి మంత్రివర్గంలో కామినేని శ్రీనివాస్ రావు, మాణిక్యాలరావులకు చోటు దక్కింది. మరో మంత్రిపదవిని బిజెపి కోరుతోంది.మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో మరో పదవి దక్కే అవకాశం ఉండడంతో వీర్రాజు వ్యూహాం ప్రకారంగానే మౌనంగా ఉంటున్నారని కొందరు బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
ap cm chandrabau naidu plan to Reshuffle his cabinet .bjp wants to another berth in babus cabinet.so bjp leader veerraju calm somedays ago.he wants berth in ap cabinet.veerraju plan to close ap cm babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X