విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై ఐవైఆర్ కోపానికి కారణలివే: ఎమ్మెల్సీ పదవి దక్కలేదా?

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రహ్మణ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావుకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలనే ప్రతిపాదనపై చంద్రబాబునాయుడు వద్ద కొందరు పార్టీ నాయకులు చేసిన ప్రతిపాదనను బాబు తీవ్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బ్రహ్మణ కార్పోరేషన్ మాజీ ఛైర్మెన్ ఐవైఆర్ కృష్ణారావుకు ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలనే ప్రతిపాదనపై చంద్రబాబునాయుడు వద్ద కొందరు పార్టీ నాయకులు చేసిన ప్రతిపాదనను బాబు తీవ్రంగా వ్యతిరేకించారు.మరోవైపు టిటిడి ఈఓ నియామకం విషయంలో కూడ బాబు తీరును ఐవైఆర్ కృష్ణారావు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వరుసగా తనకు వ్యతిరేకంగా సాగడంతో ఐవైఆర్ బాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశారంటున్నారు.

ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ తీరును, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై బహిరంగంగానే విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో కూడ పోస్టులు పెట్టారు. అయితే ఈ పోస్టుల కారణంగా ఏపీ బ్రహ్మాణ కార్పోరేషన్ చైర్మెన్ పదవి నుండి ఐవైఆర్ ను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

అంతేకాదు ఏపీ బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ గా వేమూరి ఆనంద్ సూర్యను నియమించింది ప్రభుత్వం. అయితే ఏరీకోరి తెచ్చుకొన్న రిటైర్డ్ ఐఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు బాబుపై అసంతృప్తికి పలు కారణాలున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి.

ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తన వైఖరిని ఐవైఆర్ తప్పుబట్టారు. అంతేకాదు ప్రభుత్వ నామినేట్ పదవిలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

కేంద్రానికి లేఖ రాశారా?

కేంద్రానికి లేఖ రాశారా?

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్రానికి తొలి ప్రధాన కార్యదర్శిగా ఐవైఆర్ కృష్ణారావును నియమించుకొన్నారు చంద్రబాబునాయుడు. అయితే ఏపీ రాజధాని దొనకొండలో ఉంటే మంచిదని అప్పట్లో ఆయన నేరుగా కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారని నర్సరావుపేట ఏంపీ రాయపాటి సాంబశివరావు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారని మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రభుత్వానికి తెలియకుండానే ప్రధానకార్యదర్శి హోదాలో కేంద్రానికి లేఖ రాయడమేమిటన్న ప్రశ్న ఉత్పన్నమైంది.

బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి

బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవి


రిటైర్మెంట్ వరకు ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు.అంతేకాదు ఆయన రిటైర్మెంట్ కంటే మూడు రోజుల ముందే తాను కోరుకొన్న బ్రహ్మణ కార్పోరేషన్ పదవిని చంద్రబాబునాయుడు కట్టబెట్టారు.అంతేకాదు వెంటనే జీవో జారీ చేశారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా బ్రహ్మణ కార్పోరేషన్ విషయంలో ఆయన వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఈ విషయమై టిడిపి ప్రజాప్రతినిధులు పలువురు చంద్రబాబునాయుడుకు ఫిర్యాదులు చేశారు. దీనికితోడు వైసీపీకి చెందినవారిని జిల్లా కో ఆర్డినేటర్లుగా నియమిస్తున్నారనే ఫిర్యాదులు కూడ వచ్చాయి.సోషల్ మీడియాలో పోస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడంతో బ్రహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ పదవిని వదులుకోవాల్సి వచ్చింది ఐవైఆర్ కృష్ణారావు.

ఎమ్మెల్సీ చేయాలని టిడిపి నేతల ప్రతిపాదన

ఎమ్మెల్సీ చేయాలని టిడిపి నేతల ప్రతిపాదన

ఐవైఆర్ కృష్ణారావును ఎమ్మెల్సీ చేయాలని కొందరు టిడిపి నేతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద ప్రతిపాదన తెచ్చారని సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపట్లచంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారని పార్టీ వర్గాలంటున్నాయి. ఈ విషయం ఐవైఆర్ కు చేరిపోయింది.ఈ పరిణామం కూడ ఐవైఆర్ కు ఆగ్రహం తెప్పించిందని మీడియాలో కథనాలు వచ్చాయి.

 టిటిడి ఈఓ పోస్టు ఉత్తరాది వ్యక్తికి కేటాయించడంపై

టిటిడి ఈఓ పోస్టు ఉత్తరాది వ్యక్తికి కేటాయించడంపై


టిటిడి ఈవో పోస్టును తనకు అనుకూలమైన అధికారికి కేటాయించేందుకు కృష్ణారావు లాబీయింగ్ చేశారనే ప్రచారం కూడ ఉంది.అయితే టిటిడి ఈవో పదవిని ఉత్తరాదికి చెందిన వ్యక్తికి బాబు కేటాయించారు.అయితే దక్షిణాదికి చెందినవారికి కాకుండా ఉత్తరాదికి చెందినవారికి టిటిడి ఈవో పోస్టును కేటాయించడంపై ఐవైఆర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై ఇది సంప్రదాయమా అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

పార్టీకి సంబంధం లేనివారికి కట్టబెడితే అంతే

పార్టీకి సంబంధం లేనివారికి కట్టబెడితే అంతే

పదేళ్ళపాటు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా...పార్టీకోసం కష్టపడినవారిని కాదని రిైటర్డ్ ఐఎఎస్ అధికారులకు కట్టబెడితే ఫలితం ఇలానే ఉంటుందని పార్టీ శ్రేణులు ఆగ్రహన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకదాని వెంట ఒకటిగా తాను అనుకొన్న అంశాలేవీ కార్యరూపం దాల్చకపోవడంతో ఐవైఆర్ కు కోపం వచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ముఖ్యమంత్రిని కలిసి కూడ కలవలేదంటూ తప్పుడు ప్రచారం చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐవైఆర్ కోటరీగా ఉన్న అధికారులపై కూడ ఓ కన్నేసీ ఉంచారంటున్నారు.

English summary
what is the reason former Ap brahmin corporation chairman IYR Krishna Rao on anger on Ap chief minister Chandrababu naidu.A media report on differences between chandrababu and IYR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X