వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా బలహీనత అదే, ఎమ్మెల్యే కావాలనేది బలమైన కోరిక: లోకేష్

కష్టపడి పనిచేయడం నా బలం. మా నాన్న మాదిరిగానే ఎంతసేపైనా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆహరం విషయంలో మాత్రం నాన్నతో పోటీ పడలేకపోతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కష్టపడి పనిచేయడం నా బలం. మా నాన్న మాదిరిగానే ఎంతసేపైనా పనిచేసేందుకు ప్రయత్నిస్తున్నాను. ఆహరం విషయంలో మాత్రం నాన్నతో పోటీ పడలేకపోతున్నానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఆహర నియమాల్లో నాన్న మాదిరిగా మనసును అదుపులో పెట్టుకోలేకపోతున్నానని ఆయన చెప్పారు.

మంత్రిగా బాధ్యతలను స్వీకరించి వందరోజులను పూర్తిచేసుకొన్న సంరద్భంగా నారా లోకేష్ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు.. ఈ ఇంటర్వ్యూలలో ఆయన పలు అంశాలపై స్పందించారు.

అరవైలో ఇరవై, చంద్రబాబు ఆరోగ్యరహస్యమిదే, మెనూ ఇదే!అరవైలో ఇరవై, చంద్రబాబు ఆరోగ్యరహస్యమిదే, మెనూ ఇదే!

కుటుంబంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మంత్రిగా బాధ్యతల నిర్వహణ, వైసీపీ చేస్తున్న ఆరోపణలు , నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలపై కూడ ఆయన స్పందించారు.

తన బలాలు బలహీనతలు ఏమిటో కూడ ఆయన చెప్పారు. అయితే వాటిని సరిచేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆయన వివరించారు.

అదే నా బలహీనత

అదే నా బలహీనత

నా తండ్రితో పోటీ పడి పనిచేస్తున్నానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎంత సేపైనా కష్టపడి పనిచేయడం అలవాటు చేసుకొన్నానని చెప్పారు. అయితే అదే సమయంలో ఆహర నియమాల విషయాల్లో మాత్రం ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. నా తండ్రి మాత్రం ఆహర నియమాలను ఖచ్చితంగా పాటిస్తారు. ఆయన మాదిరిగా ఆహర నియమాలను పాటించే విషయంలో సాధ్యపడడం లేదన్నారు. స్వీట్లు చూస్తే తాను మాత్రం మనస్సును ఆపుకోలేక పోతున్నట్టు ఆయన చెప్పారు. స్వీట్లు అతిగా తినేస్తున్నట్టు చెప్పారు.

ఎమ్మెల్యే కావాలనేది బలమైన కోరిక

ఎమ్మెల్యే కావాలనేది బలమైన కోరిక

తనకు ఎమ్మెల్యే కావాలనేది బలమైన కోరిక. దీనికి తోడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని కూడ కోరిక ఉంది. అయితే మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ఎమ్మెల్యేగా విజయం సాధించాలనేది బలంగా ఉందన్నారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు నడుచుకొంటానని ఆయన చెప్పారు. ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి చోటు దక్కడంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తన కోసం మరో ఎమ్మెల్యేను బలిచేయడం తనకు ఇష్టం లేదన్నారు. అందుకే ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీగా మంత్రివర్గంలోకి చేరినట్టు చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని పాటిస్తానని చెప్పారు.

పార్టీలో ప్రత్యేక వర్గమా?

పార్టీలో ప్రత్యేక వర్గమా?

పార్టీయే తన వర్గమని లోకేష్ చెప్పారు. తనకంటూ ప్రత్యేకంగా పార్టీలో వర్గం లేదన్నారు. టిడిపిలో 35 మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. మహనాడు విజయవంతానికి యువ కార్యకర్తలు శ్రమించారని ఆయన చెప్పారు. అయితే యువ కార్యకర్తలు పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారో వారిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకొంటామని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యువకులకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు దక్కుతాయన్నారు.

ఆరోపణలు రుజువైతే చర్యలు

ఆరోపణలు రుజువైతే చర్యలు

ఒకరిద్దరూ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తే అంతరూ టిడిపి ఎమ్మెల్యేలు తప్పులు చేసినట్టు అవుతోందా అని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలను సిఎం పిలిచి మాట్లాడుతున్నారని లోకేష్ చెప్పారు. ఆరోపణలు రుజువైతే వారిపై కఠినంగానే వ్యవహరిస్తామన్నారు లోకేష్. విశాఖలో ఓ ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి.వాటిలో వాస్తవాలు వెల్లడి కావాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
When I seeing sweets Iam out of control said Andhra pradesh minister Nara Lokesh. Telugu news channels interviewed him on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X