కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరీ సాంబశివుడు?: నారాయణరెడ్డితో మృత్యువులోనూ వెన్నంటి!..

నారాయణరెడ్డి-సాంబశివుడి మధ్య అనుబంధం పదేళ్లుగా కొనసాగుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. నారాయణరెడ్డి ఎక్కడికెళ్లినా.. కచ్చితంగా సాంబశివుడిని వెంట తీసుకెళ్లేవాడు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: ఫ్యాక్షన్ హత్యకు బలైపోయిన పత్తికొండ వైసీపీ ఇన్ చార్జీ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. అత్యంత దారుణంగా ప్రత్యర్థుల చేతిలో హతమైన నారాయణరెడ్డిని ప్రత్యర్థులు పక్కాప్లాన్ తో మట్టుబెట్టారు. సమయానికి ఆయన వద్ద రివాల్వర్ లేకపోవడం కూడా వారికి కలిసొచ్చింది.

నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుడు.. ప్రత్యర్థి దాడిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. నారాయణరెడ్డిని హతమార్చిన తర్వాత సాంబశివుడిని కూడా వెంటాడి మరీ ప్రత్యర్థులు హత్య చేశారు. నారాయణ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న సాంబశివుడు ఆయనతో పాటే మృత్యు కౌగిలిలోకి వెళ్లడం పత్తికొండలో చర్చనీయాంశంగా మారింది.

who is sambasivudu?, murdered with narayana reddy in pathikonda

నారాయణరెడ్డి-సాంబశివుడి మధ్య అనుబంధం పదేళ్లుగా కొనసాగుతున్నట్లు అనుచరులు చెబుతున్నారు. నారాయణరెడ్డి ఎక్కడికెళ్లినా.. కచ్చితంగా సాంబశివుడిని వెంట తీసుకెళ్లేవాడు. నారాయణరెడ్డికి రక్షణగా నిలుస్తూ.. ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ఉండేవాడు. నారాయణరెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసిన తర్వాత సాంబశివుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాడు.

ఆదివారం రోజు నారాయణరెడ్డిపై దాడి జరిగిన సమయంలోను మిగతా అనుచరుల్లా సాంబశివుడు పారిపోలేదు. ధైర్యంగా ప్రత్యర్థుల పట్ల తిరగబడి, నారాయణరెడ్డిని కాపాడే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తనను చంపేవరకు వదిలిపెట్టరని, మీరు ఇక్కడినుంచి వెళ్లిపోవాలని నారాయణరెడ్డి చెబుతున్నా.. సాంబశివుడు అక్కడినుంచి కదల్లేదు. చివరకు ప్రత్యర్థులు సాంబశివుడిని హత్య చేసిన తర్వాతే నారాయణరెడ్డిని హతమార్చారు. సాంబశివుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం.

<strong>ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..</strong>ఒళ్లు గగుర్పొడిచేలా నారాయణరెడ్డి హత్య: హత్యలోని కోణాలివే!..

English summary
While opponents were attacking Ysrcp incharge Narayana Reddy, Sambasivudu was tried to protect him. But unfortunately both were murdered in the incident
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X