వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిదే! చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు

నిరంతరంగా 15 గంటలపాటు పనిచేయడం వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేయడం వల్లే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నిరంతరంగా 15 గంటలపాటు పనిచేయడం వల్లే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిచేయడం వల్లే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దొండపాడులో జరిగిన సభలో చంద్రబాబునాయుడు నీరసంతో కుర్చీలోనే కూర్చోవడం టిడిపి నేతలను కలవరపాటుకు గురి చేసింది.

అరవైలో ఇరవై, చంద్రబాబు ఆరోగ్యరహస్యమిదే, మెనూ ఇదే!అరవైలో ఇరవై, చంద్రబాబు ఆరోగ్యరహస్యమిదే, మెనూ ఇదే!

ఆహరం, ఆరోగ్య సూత్రాలను పాటించడంలో చంద్రబాబునాయుడు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారు. మితహరం తీసుకోవడం, శాఖాహరం మాత్రమే భుజించడాన్ని చంద్రబాబునాయుడు ఏళ్ళ తరబడి పాటిస్తున్నారు.

గంటల తరబడి చంద్రబాబునాయుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమీక్షలు, సమావేశాల్లో పాల్గొనడానికి కారణం ఆయన పాటించే ఆరోగ్య సూత్రాల వల్లేనని టిడిపి నేతలు చెబుతుంటారు.

ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరంగా ఆయన పనిచేయడానికి చంద్రబాబు తీసుకొనే ఆహరపు అలవాట్లనే ప్రధానంగా చెబుతారు. అంతేకాదు యోగా, ఎక్సర్‌సైజ్ లాంటివి క్రమం తప్పకుండా చంద్రబాబు చేస్తారు.

గంటల తరబడి పనిచేయడమే కారణమా?

గంటల తరబడి పనిచేయడమే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం, అభివృద్ది పనులతో పాటు పార్టీ వ్యవహరాలపై చంద్రబాబు నిరంతరం బిజీ బిజీగా గడుపుతున్నారు. అన్నీ పనులు తానే చూసుకోవడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నాయని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్‌ను కుదించుకొని కొంతసేపు విశ్రాంతి తీసుకొంటే ప్రయోజనం ఉంటుందని సీనియర్ పార్టీ నాయకులు బాబుకు సూచిస్తున్నారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
బాబు మెనూ ఇదే

బాబు మెనూ ఇదే

ఉదయం పూట నాలుగున్నర గంటలకు నిద్రలేచే చంద్రబాబు నాయుడు కాలకృత్యాలు తీర్చుకొని యోగా, ఎక్సర్‌సైజ్, ధ్యానం చేస్తారు. ఆ తర్వాత పత్రికలు చదువుతారు. ఏడుగంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. ఆ తర్వాత రోజూవారీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం లంచ్ సమయం లోపుగా కొన్ని పండ్లు తీసుకొంటారు. మధ్యాహ్నం రాగి, జొన్న సంకటి , కూర, పెరుగన్నం తింటారు. అప్పుడప్పుడూ చేప ముక్కలను తీసుకొంటారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తిరిగి సమావేశాల్లో పాల్గొంటారు. అప్పుడప్పుడూ పండ్లరసాలు, సాయంత్రం టీ, ఆ తర్వాత స్నాక్స్, రాత్రికి పుల్కా, పెరుగుతో భోజనం చేస్తారు.

నిర్ణీత సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి

నిర్ణీత సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలి

నిర్ణీత సమయాల్లో విశ్రాంతి తీసుకోవాలని చంద్రబాబునాయుడుకు పార్టీ నాయకులు సూచిస్తున్నారు. వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడవిశ్రాంతి కోరుకొంటుందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.షెడ్యూల్ ప్రకారంగా పనులను పూర్తి చేసుకొంటే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం కావనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.

చిన్న సమస్యలు కూడ బాబు వద్దకే

చిన్న సమస్యలు కూడ బాబు వద్దకే

పార్టీ సమస్యలైనా, ప్రభుత్వంలో పాలన పరమైన సమస్యలైనా పరిష్కరించేందుకు గాను చంద్రబాబు వద్దకు వెళ్తే గానీ పరిష్కారమయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ తరహ మసస్యలను మంత్రులు, పార్టీ నేతలు తమ స్థాయిల్లో పరిష్కరిస్తే బాబుకు శ్రమ తప్పుతోందని కొందరు పార్టీ సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు.పనులు జరిగేలా సమన్వయం చేస్తే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. ప్రతి పనిని తానే చేయాలని అనుకోవడం వల్ల కూడ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కూడ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

English summary
Ap cm chandrababu naidu continues working for 12 to 15 hours per day.senior party leaders suggested to Chandrababu take rest some time in a day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X