వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'అర్జునుడు' రేవంత్ అంటే తెరాసకు భయం, మాకు శని: ఎర్రబెల్లి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాము ఏ తప్పు చేయకున్నా శిక్షను అనుభవిస్తున్నామని, తాము సభలో ప్రజల కోసం పంచ పాండవుల్లా కొట్లాడుతున్నామని, తమ పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి అర్జునుడిలా పోరాడుతున్నారని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు తెలంగాణ శాసన సభలో శుక్రవారం అన్నారు. రేవంత్ రెడ్డి అంటే అధికార పార్టీకి అంత భయమెందుకన్నారు.

తాము పాండవుల్లా పోరాడుతుంటే, అధికార పక్షం కౌరవుల్లా వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం పార్టీకి పదేళ్ల వనవాసం పూర్తయిందని చెప్పారు. మరో ఐదేళ్లు మమ్మలను శని వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టారన్నారు.

సంక్షేమ పథకాలు అమలు చేయకుంటే తాము నిలదీస్తామన్నారు. ఇప్పటి వరకు 600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. దయచేసి ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించాలన్నారు. తెలంగాణ సాధనకు అన్ని వర్గాలు కృషి చేశాయన్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తే ప్రభుత్వానికి సహకరించేందుకు తాము సిద్ధమన్నారు.

Why TRS afraid of Revanth Reddy: Errabelli

ఎప్పుడు మోడీ గీడీ అనకుండా.. కేంద్రంతో సన్నిహితంగా ఉండే రైతు ఆత్మహత్యలు ఆపేలా చూద్దామన్నారు. తమ మీద, తమ పార్టీ మీద దాడి చేసే బదులు రైతుల గురించి ఆలోచించాలన్నారు. నల్గొండ జిల్లాలో తమ పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందని గుర్తు చేశారు. తమ పైన దాడి కంటే రైతులకు ఏం చేయాలో చూడాలన్నారు. విద్యుత్ విషయంలో రైతులకు భరోసా ఇవ్వాలన్నారు. బడ్జెట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పారు.

ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్రవ్యవినిమయ బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై ఉత్తమ్‌ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్షకోట్ల బడ్జెట్‌పై లోతుగా పరిశీలిన చేసినట్లు తమకు కనిపించడం లేదన్నారు.

ప్రభుత్వ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విమర్శించారు. బడ్జెట్‌ ప్రతులను చూసి తనకు ఆశ్చర్యమేసిందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో వ్యాపార రాజధాని హైదరాబాద్‌ రెవెన్యూ తెలంగాణ రాష్ర్టానికే చెందేలా కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర విభజనలో ఆంక్షలు లేని తెలంగాణను కాంగ్రెస్‌ ఇచ్చిందన్నారు.

కొత్త రాష్ట్రంలో ప్రజలంతా మెరుగైన జీవనం ఉంటుందని భావించారని అయితే ప్రజల్లో అసహనం నెలకొందన్నారు. ఉద్యోగాలు రావడం లేదని విద్యార్థులు, కరెంట్‌సమస్య, పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆయోమయంలో ఉన్నారన్న తెలిపారు.

కరువు మండలాలను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, రైతులు ఆత్మహత్యలు సమాజానికి సిగ్గు చేటు అన్నారు. అన్ని పంటలకు రూ.100 బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విజయా డెయిరీ లేని చోట పాల ఉత్పత్తులకు ప్రోత్సహకాలు ఇవ్వాలని సూచించారు.

English summary
Why TRS afraid of Revanth Reddy, questions Errabelli Dayakar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X