వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్! నన్నెందుకు కాల్చాలి, పవన్‌పై జాగ్రత్త: బాబు, సర్వేలో వైసిపికి 30 సీట్లే

వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

నంద్యాలలో కదిరి బాబురావు ఇష్యూ: ఆ రోజు ఏం జరిగిందంటే?నంద్యాలలో కదిరి బాబురావు ఇష్యూ: ఆ రోజు ఏం జరిగిందంటే?

అధికారంలో లేనప్పుడే జగన్ ఇంత ఉన్మాదిలా మాట్లాడితే, అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడుతారోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు టిడిపి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అధికారంలో లేకుంటేనే జగన్ ఇంత ముర్ఖుడిగా

అధికారంలో లేకుంటేనే జగన్ ఇంత ముర్ఖుడిగా

ప్రతిపక్షాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా మనం సంయమనం పాటించాలని నేతలకు చంద్రబాబు ఉద్భోత చేశారు. జగన్ ఎంత శాడిస్టో అతని వ్యాఖ్యలే నిదర్శనం అన్నారు. జగన్ ఉన్మాదిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

నన్ను ఎందుకు కాల్చిచంపాలి

నన్ను ఎందుకు కాల్చిచంపాలి

తనను కాల్చి చంపాలని జగన్ ఎందుకు అన్నారో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. 'నన్ను ఎందుకు కాల్చి చంపాలి. నేను చేసిన పని ఏమిటి, జగన్ చేసిన పని ఏమిటి' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Recommended Video

Chandrababu Gave Promise to Bhuma Akhila Priya Over Nandyal MP
సర్వేలో తేలింది వైసిపికి 30 సీట్లే

సర్వేలో తేలింది వైసిపికి 30 సీట్లే

నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం తథ్యమని చెప్పారు. భూమా బ్రహ్మానంద రెడ్డి కచ్చితంగా గెలుస్తారని చంద్రబాబు అన్నారు. 2019లో వైసిపికి 30 సీట్లకు మించి రావని సర్వేలు చెబుతున్నాయని చంద్రబాబు అన్నారు.

పవన్ కళ్యాణ్, బిజెపి పట్ల జాగ్రత్త!

పవన్ కళ్యాణ్, బిజెపి పట్ల జాగ్రత్త!

మిత్రపక్షాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. బిజెపి లేదా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండాలని హితవు పలికారు. 2019కి ఇప్పటి నుంచే సమాయత్తం కావాలన్నారు. ప్రతి గ్రామంలో టిడిపి జెండా ఎగరాలన్నారు.

నంద్యాలపై చంద్రబాబు ధీమా

నంద్యాలపై చంద్రబాబు ధీమా

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబు ధీమాగా ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అభిప్రాయపడ్డారు. నంద్యాలలో మెజార్టీ పైనే దృష్టి సారించాలని నేతలకు సూచించారు.

English summary
Why YSR Congress Party chief YS Jaganmohan Reddy blaming me in Nandyal public meeting, asked AP CM Chandrababu Naidu on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X