కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'వచ్చినట్లే వెళ్తారు... తిరిగి జగన్ గూటికే మంత్రి ఆదినారాయణ రెడ్డి!'

|
Google Oneindia TeluguNews

కడప: తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి తామంతా పార్టీ కోసమే పని చేస్తున్నామని, అవకాశవాదులు పార్టీలోకి వచ్చినట్లే తిరిగి వెళ్లిపోవడం ఖాయమని టిడిపి కడప జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీదేవమ్మ మంత్రి ఆదినారాయణ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

<strong>అబ్బే అంతా ఒట్టిదే: టిడిపిలోనే ఉంటా, త్వరలోనే బాబును కలుస్తా: రామసుబ్బారెడ్డి</strong>అబ్బే అంతా ఒట్టిదే: టిడిపిలోనే ఉంటా, త్వరలోనే బాబును కలుస్తా: రామసుబ్బారెడ్డి

అలాంటి వారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రామసుబ్బా రెడ్డి కుటుంబం టిడిపి కోసం పని చేసిందని మరో నేత హరీంద్రనాథ్ అన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు.

<strong>వచ్చెయ్, అప్పుడే వద్దన్నా: జగన్‌కు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆఫర్</strong>వచ్చెయ్, అప్పుడే వద్దన్నా: జగన్‌కు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆఫర్

కాగా, ఆదినారాయణ రెడ్డి 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత పలు కారణాలతో టిడిపిలో చేరారు. అటు ఆదినారాయణ అవసరం, ఇటు టిడిపి అవసరం దృష్ట్యా ఆయన సైకిల్ ఎక్కారు.

జగన్‌కు చెక్ చెప్పేందుకు తీసుకు వచ్చారు.. కానీ

జగన్‌కు చెక్ చెప్పేందుకు తీసుకు వచ్చారు.. కానీ

కడప జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెక్ చెప్పేందుకు టిడిపి పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కడపలో కీలకమైన నేతలపై కన్నేసింది. అయితే, అవసరం కోసం వచ్చిన ఆది.. 2019లో అనూహ్యం జరిగితే.. తిరిగి వైసిపిలోకి వెళ్లినా ఆశ్చర్యం లేదని కడప జిల్లా రామసుబ్బారెడ్డి వర్గీయులు భావిస్తున్నారు.

పార్టీని వదల్లేదని...

పార్టీని వదల్లేదని...

కాగా, ఆదివారం రోజు రామసుబ్బా రెడ్డి తన వర్గీయులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆయన మహానాడుకు గైర్హాజరయ్యారు. అయితే, జమ్మలమడుగులో ఎన్టీఆర్ జయంతిలో పాల్గొన్నారు.

పార్టీ కోసం త్యాగాలు చేసే నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నారని రామసుబ్బా రెడ్డి అన్నారు. కష్టనష్టాల్లో ఉన్నప్పుడు సైతం తాము పార్టీని వదలలేదన్నారు.

అవకాశవాదులు వచ్చారని..

అవకాశవాదులు వచ్చారని..

ఇప్పుడు పార్టీ అధికారం ఉండగా, కొందరు అవకాశవాదులు పార్టీలోకి వచ్చారని ఆదినారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో వూహించని పరిణామాలు చోటుచేసుకున్నాయని, అందుకే మహానాడు కార్యక్రమానికి వేళ్లలేకపోయానన్నారు.

పార్టీ స్థాపించినప్పటి నుంచి మహానాడు కార్యక్రమానికి తమ కుటుంబ సభ్యులు తప్పకుండా వెళ్లేవారమని, మొదటిసారిగా వెళ్లనందుకు బాధగా ఉందని రామసుబ్బా రెడ్డి చెప్పారు.

టిడిపి అభ్యున్నతి కోసమే..

టిడిపి అభ్యున్నతి కోసమే..

ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ అభ్యున్నతి కోసం కట్టుబడి ఉన్నామని రామసుబ్బారెడ్డి అన్నారు. నిస్వార్థంగా పనిచేసిన వారికి అన్యాయం జరగదనే భరోసాను నాయకుల్లో కలిగించాల్సిన అవసరముందన్నారు. ఎంత ఇబ్బందిగా ఉన్నా పార్టీ కోసమే పని చేస్తామని రామసుబ్బా రెడ్డి అన్నారు.

English summary
Will Minister and Jammalamadugu MLA Adinarayana Reddy return to YSR Congress?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X