వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజనతోనే అంతా: బాబు, ఇలా ఇవ్వొచ్చని బీజేపీకి

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయనగరం: విభజనతో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారిందని కేంద్రం సాయం ఆశాజనకంగా లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. ప్రత్యేక హోదాకు అడ్డంకులు ఉంటే కేంద్రం నిధులు ఇవ్వాలని కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురంలో జరిగిన నీరు చెట్టు అవగాహన సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు.

జంఝావతి ఆనకట్ట పైన ఒడిశా ప్రభుత్వం సహకరించడం లేదని అన్నారు. ఆ రాష్ట్రంలో వెయ్యి ఎకరాలు ముంపునకు గురవుతుందని, వారికి నష్టపరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీనిపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మాట్లాడుతానని చెప్పారు.

చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీతానగరం మండలం చినభోగిలికి చెందిన రైతు గుణుపూరు రాము సభ జరుగుతున్న సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. పక్కనున్న వారు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. చినభోగిలి వీఆర్వో తనకు భూసంబంధ పత్రాలు మంజూరు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాడని రైతు పేర్కొన్నారు. వీఆర్వో వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

చంద్రబాబు

చంద్రబాబు

ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ సబ్ కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ సమావేశమై కార్మికుల సమస్యలను చర్చించేలోపే కార్మికులు సమ్మెబాట పట్టడం విచారకరమని చంద్రబాబు అన్నారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద బుధవారం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మట్టి పూడికతీత పనులను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు మరింతగా పని చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. సమస్కల పరిష్కారానికి ఆందోళన బాట పట్టడం మంచిది కాదన్నారు. కష్టాల నుండి ఆర్టీసీని గట్టెక్కించాల్సిన బాధ్యత కార్మికులపైనే ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని వివిధ పద్ధతుల్లో ఆందోళన చేస్తున్న వారికి తమ మద్దతు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ సాధిస్తామన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తా తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు రైతుల రుణమాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకర్లు సహకరించకపోయినా ధైర్యంగా ముందుకెళ్ళి దశల వారీగా రుణమాఫీని అమలు చేస్తున్నామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

డ్వాక్రా సంఘాలు చెల్లించిన రూ.1200 కోట్ల వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన అసమగ్రంగా జరగడంతో ఏపీకి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఈ పరిస్థితిని అధిగమించి ఆదాయ వనరులు పెంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉదారంగా సహాయం అందించాలని, రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేంతవరకు అండగా నిలవాలన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రెండురోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రకటించిన విధంగా బుధవారం రాత్రి తోటపల్లి ప్రాజెక్టు వద్ద కెనాల్ చంద్రబాబు నిద్ర చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలతో బిజీగా గడిపిన ముఖ్యమంత్రి రాత్రి 9.30 గంటల వరకు వివిధ శాఖల అధికారులతో సమీక్షలు జరిపారు. ఆ తర్వాత తోటపల్లి ప్రాజెక్ట్ గెస్ట్‌హౌస్ పక్కన నిలిపి ఉంచిన ప్రత్యేక బస్సులో నిద్ర చేశారు. ఆయనతోపాటు మంత్రి దేవినేని ఉమ, ముఖ్య ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటిస్తుందన్న నమ్మకం తనకుందని చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి విజయనగరం జిల్లా తోటపల్లి ప్రాజెక్టు గెస్ట్‌ హౌస్‌ వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పటికీ నిధులు మంజూరుకు వచ్చేసరికి మొండిచేయి చూపారన్నారు. అందువల్ల ఏపీ విషయంలో అది పునరావృతం కారాదన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు


ప్రత్యేక హోదా ప్రకటించేందుకు కేంద్రానికి అడ్డంకులుంటే ఆ స్థాయిలో నిధులు మంజూరు చేయాలని కోరారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం పట్టుదలగా ఉందని తెలిపారు. ప్రతి ఎకరాకు నీరందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. రైతులకు భరోసా ఇవ్వడం కోసం తాను ప్రాజెక్టుల వద్ద నిద్రించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరూ పోరాడినా తాను మనస్ఫూర్తిగా అభినందిస్తానని హీరో శివాజీ దీక్షను ఉద్దేశించి అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, సమీకరణలో ఏం చేయాలనే దానిపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

విజయనగరం పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించామని చంద్రబాబు తెలిపారు. ఒకవేళ కేంద్రం ముందుకు రాకపోతే ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సీపురంలో నీరు చెట్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నర్సీపురంలో ట్రాక్టర్ నడిపి అందరనీ అలహించారు. బాబు ట్రాక్టర్ నడుపుతున్న దృశ్యం

English summary
Will Bring Pressure on Centre for Special Status to Andhra Pradesh: Chief Minister N Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X