విజయనగరం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎత్తుకుపైఎత్తు: అశోక్ గజపతి రాజుకు గంటా చెక్ చెప్పేనా?

విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్ష పదవిపై ఇటు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, అటు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావులు పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు అశోక్ కనుసన్నుల్లోనే ఎంపిక జరిగేది

|
Google Oneindia TeluguNews

విజయనగరం: విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్ష పదవిపై ఇటు కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు, అటు రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావులు పావులు కదుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు అశోక్ కనుసన్నుల్లోనే ఎంపిక జరిగేది. ఈసారి అలా జరగడం లేదు.

ఇది అశోక్ వర్గానికి ఆగ్రహం తెప్పిస్తోందని తెలుస్తోంది. అధ్యక్ష పదవిపై ఒకరికొకరు ధీటుగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అశోక్ హవాకు చెక్ పెట్టాలనుకుంటే, పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన వర్గీయులు గంటా తీరుపై అసహనంతో ఉన్నారు.

ఏపీలో 12 జిల్లాల టిడిపి అధ్యక్ష పదవులకు ఎన్నిక అయిపోయింది. విజయనగరం మాత్రమే మిగిలి ఉంది. సాధారణంగా టిడిపి జిల్లా అధ్యక్షుల ఎంపిక మహానాడుకు ముందే పూర్తవుతుంది. కానీ ఈసారి ఈ జిల్లాలో మాత్రం అలా జరగలేదు. ఇది చర్చకు దారి తీసింది.

గంటా వల్లే..

గంటా వల్లే..

ఇంచార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస రావు వల్లే ఇదంతా జరుగుతోందని టిడిపి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా అశోక్‌కు వ్యతిరేకంగా గంటా వ్యవహరిస్తున్నారని ఆయన వర్గం ఆవేదన చెందుతోంది.

అశోక్ ఎవరి పేరు చెప్తే..

అశోక్ ఎవరి పేరు చెప్తే..

గతంలో ఎప్పుడూ అశోక్ గజపతి రాజు సూచించిన వారే అధ్యక్షుడిగా అయ్యేవారని అంటున్నారు. ప్రస్తుతం అశోక్ అనుచరుడు ద్వారపురెడ్డి జగదీష్ అధ్యక్షుడిగా ఉన్నారు.

చెక్ చెప్పేందుకు..

చెక్ చెప్పేందుకు..

3 ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు పార్టీలోని కొందరు పెద్దలు పావులు కదుపుతున్నారని భావిస్తున్నారు. ఇందుకు గంటా రంగంలోకి దిగారని అశోక్ వర్గం భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

గంటా వ్యూహాలకు అశోక్ చెక్ చెప్పేనా?

గంటా వ్యూహాలకు అశోక్ చెక్ చెప్పేనా?

అయితే గంటా వ్యూహాలకు చెక్ చెప్పే విధంగా అశోక్ గజపతి రాజు కూడా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. తన మాట చెల్లుబాటు అయ్యేందుకు మరోసారి జగదీష్ పేరు చెప్పారని అంటున్నారు. దీనిపై ఏం జరుగుతుందోనని తెలుగు తమ్ముళ్లు ఉత్కంఠతో ఉన్నారు.

వరుసగా..

వరుసగా..

ఇప్పటికే శత్రుచర్ల విజయ రామారాజు, మంత్రి సుజయ కృష్ణ రంగారావులు టిడిపిలో చేరి పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అశోక్ సూచించిన వారికి అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఆయనకు చెక్ చెప్పాలని భావిస్తున్నారని అంటున్నారు.

English summary
Will AP Ministeer Ganta Srinivasa Rao shocks Union Ministe Ashok Gajapati Raju.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X