పొగడ్తలు: మోడీ వైపు టర్న్.. అంతలోనే పవన్ కళ్యాణ్‌కు జగన్ అవకాశం

Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో వైసిపిని, ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిని ప్రశంసించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడుతారని అంటున్నారు. పవన్ ప్రత్యేక హోదానే ప్రధాన అంశంగా తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ నిలదీత

హోదా కోసమే తాను బిజెపి, టిడిపిలకు మద్దతిచ్చానని, అది లేదంటే ఎవరితోనైనా కలిసి పోరాడేందుకు సిద్ధమని ప్రకటించారు. గత కొద్ది రోజులుగా హోదా విషయంలో పవన్ బీజేపీతో పాటు టిడిపిని నిలదీస్తున్నారు.

విజయసాయిని ప్రశ్నించారు సరే..

హోదా విషయంలో కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వైసిపిని ప్రశంసించి, టిడిపిని తప్పుబట్టారు. అంతేకాదు, విజయ సాయి రెడ్డి రాజ్యసభలో హోదా కోసం మాట్లాడుతున్న పత్రిక కథనాన్ని కూడా ట్వీట్ చేశారు. కానీ, ఇప్పుడు జగన్ హోదాను దాదాపు వదిలేసినట్లే కనిపిస్తోంది.

ఇరువురూ పక్కన పెట్టారు

ప్రత్యేక హోదా విషయంలో తాము రాజీపడేది లేదని, వచ్చే ఎన్నికల్లో అదే అంశం కీలకమని జగన్ ప్రకటించారు. కానీ రాజకీయ పరిణామాలను చూస్తుంటే మాత్రం నిన్న టిడిపి... ఇఫ్పుడు వైసిపి కూడా హోదా అంశాన్ని పక్కన పెట్టినట్లే అంటున్నారు.

ఛాన్స్ ఇచ్చిన జగన్

ప్రత్యేక హోదా విషయంలో టిడిపిని విమర్శించి, వైసిపిని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. నిన్నటి దాకా టిడిపి వాళ్లు పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నించే ఛాన్స్ ఇచ్చారని, ఇప్పుడు జగన్ ఇచ్చారని అంటున్నారు. జగన్‌పై పవన్ స్పందన కోసం తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకే ఓటు అని జగన్ చెప్పారు.

English summary
Will Jana Sena chief Pawan Kalyan question YSR Congress?
Please Wait while comments are loading...