హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిలాడీ లేడీ అరెస్టు: అసభ్యంగా ప్రవర్తించాడని డాక్టర్‌పై నింద

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman held for blackmailing
హైదరాబాద్‌: తప్పుడు ఆరోపణలతో పలువురిని ఫోన్‌లో బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌ చేస్తున్న కిలాడి లేడీని గురువారం సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశ్యంతో బెదిరింపులకు పాల్పడ్డ సదరు కిలాడి చివరకు కటకటాలపాలైంది. ఒంగోలు జిల్లాకు చెందిన సోమిశెట్టి సాయికుమారి(28)నగరానికి వలస వచ్చి తల్లితో కలిసి కుషాయిగూడ కమలానగర్‌లో నివాసం ఉంటోంది.

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ ఏడాది జనవరి 17న సాయికుమారి, తల్లి సరోజినిదేవి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఈసీఐఎల్‌లోని జీనియా ఆసుపత్రికి తరలించారు. వీరు చికిత్స అనంతరం పూర్తిగా కోలుకొని తిరిగి ఇంటికి వెళ్లారు. కొద్ది నెలల అనంతరం సాయికుమారి తల్లి సరోజినీదేవి అనారోగ్యంతో మృతి చెందింది.

వారం రోజుల నుంచి సాయికుమారి జీనియా ఆసుపత్రికి వెళ్తూ చికిత్స సమయంలో ఆసుపత్రి డాక్టర్లు కొందరు తనతో అసభ్యంగా ప్రవర్తించారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని తనకు రూ. 50లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని లేకుంటే ఈ విషయాన్ని పోలీసులకు, మీడియాకు చెబుతానని పదే పదే ఫోన్‌లలో బెదిరిస్తుండటంతో విసిగిపోయిన ఆసుపత్రి ఎండీ చైతన్యరెడ్డి కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కుషాయిగూడ బస్టాప్‌లో ఓ బట్టల దుకాణం ఎదుట అరటిపండ్ల తోపుడు బండి తొలగించడంలో జోక్యం చేసుకొని సదరు బట్టల దుకాణం యజమానిని రూ. 4లక్షలు ఇవ్వాలని ఫోన్‌లో బెదిరించింది. సాయికుమారిపై ఐపీసీ 448, 389, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు.

English summary
The police arrested a woman for allegedly blackmailing the management of Xenia Hospitals in ECIL on Thursday. The woman demanded money from the management alleging that she was photographed nude earlier when she was admitted in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X