వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వద్దు నాన్నా అన్నా కనికరించలేదు, ఓ తండ్రి ఇలా చేస్తాడనుకోలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని మోమిన్ పేట మండలం చిట్టెంపల్లి తండాకు చెందిన గిరిజన బాలిక పైన అత్యాచారం, హత్య కేసులో పోలీసులు తండ్రినే నిందితుడిగా తేల్చారు. తాగిన మైకంలో తన కూతురు పైన అత్యాచారానికి పాల్పడినట్లు తండ్రి కమాల్ అంగీకరించాడు.

తాను చేసిన తప్పు భార్యకు, ఊరిలోని వారికి చెబితే పరువు పోతుందే గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో చెప్పాడు. వద్దు నాన్నా అన్నా ఆ తండ్రి కనికరించలేదు.

ఈ ఘటన పైన రంగారెడ్డి జిల్లా ఏఎస్పీ చందనా దీప్తీ ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ తండ్రి ఇలా చేస్తాడని అనుకోలేదన్నారు. తండ్రి కమల్ చర్యలను చూస్తుంటే మొదటి నుండి తమకు అతని పైనే అనుమానం కలిగిందన్నారు. అతను మృగంలా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

Woman police on man, who raped and killed daughter

మహిళలు, అమ్మాయిలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆమె అన్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించాలన్నారు. ఇరవై నాలుగు గంటల్లోనే కేసును ఛేదించామని, అయితే ముందు నుండి అతని పైనే అనుమానం ఉందన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు.

నిందితుడికి కుటుంబ సభ్యుల అండ

బాలిక హత్య కేసులో తండ్రి కమాల్‌ను పోలీసులు నేరస్తుడిగా తేల్చడంపై అతని కుటుంబ సభ్యులు స్పందించారు. అతను అలాంటి వాడు కాదని, పోలీసులు కొట్టి అతడితో నేరం ఒప్పించి ఉంటారని అతని తల్లి, అత్త ఆరోపిస్తున్నారు. భార్య మాట్లాడే పరిస్థితుల్లో లేదని తెలుస్తోంది.

English summary
Woman police on man, who raped and killed daughter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X