వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యేక హోదా: పార్లమెంట్ ఆవరణంలో ఎంపీల ధర్నా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఎంపీలు పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. సోమవారం ఉదయం ఈ ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చెయ్యాలని నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో మాట ఇచ్చారని, ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

YCP MPs Continue protests near Gandhi Statue in Parliament

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుంటే రాష్ట్రం అభివృద్ది చెందదని, ప్రజలకు కష్టాలు వస్తాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే విషయంలో సహకరించాలని అన్నారు.

గత వారం నుంచి వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు తాము ఇలాగే ఆందోళనలు చేస్తామని వైసీపీ ఎంపీలు అంటున్నారు.

English summary
YSRCP MPs Continue protests near Gandhi Statue in Parliament over Andhra Pradesh Special Status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X