అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హత్య వీరి పనే, బాబే ఉండగా సునీత ఉండరా: జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డీజీపీతో కలిసి హత్యలు చేయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవార ఆరోపించారు.

రాజకీయ హత్యలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. జగన్ సోమవారం తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, రోజా, జ్యోతుల నెహ్రు తదితరులతో రాజ్ భవన్‌కు వెళ్ళి గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల గురించి గవర్నర్‌కు వివరించామన్నారు. అనంతపురంలో భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డిని గత నెల 29వ తేదీన హత్య చేశారని, ఎమ్మార్వో కార్యాలయానికి రావాల్సిందిగా ఫోన్ చేసి పిలిపించారని, అక్కడ అప్పటికే ఆయుధాలతో ఉన్న వారు దాడి చేసి అతికిరాతకంగా హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హత్యలో అధికారులు కూడా పాల్గొన్నారన్నారు.

జగన్

జగన్

స్థానిక పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ జేబుకు ఉండే నేమ్ ప్లేట్ సంఘటనా స్థలంలో దొరికిందని జగన్ చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరిగిందని అన్నారు.

 జగన్

జగన్

ఈ ఘటనకు నెల క్రితం అదే జిల్లాలో కిష్టపాడు గ్రామంలో తమ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్‌కు సీఈవో ఫోన్ చేసి పిలిపించి కట్టెలతో కొట్టించి హత్య చేయించారని ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో ఎనిమిది హత్యలు జరిగాయన్నారు.

 జగన్

జగన్

అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర డీజీపీని టీడీపీ నాయకులు మామ, చిన్నాన్న, అన్నా అని సంబోధిస్తారని జగన్ చెప్పారు. అల్పాహారం ఆ జిల్లాకు చెందిన మంత్రి ఇంట్లో చేస్తారన్నారు. రెండు నెలల్లో పదవీ విరమణ చేయాల్సిన డీజీపీకి రెండేళ్ళు పదవీ కాలం పొడిగించారన్నారు.

 జగన్

జగన్

ఇవి రాజకీయ హత్యలని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. మంత్రి పరిటాల సునీత ప్రమేయం ఉందా? అని ప్రశ్నించగా... ముఖ్యమంత్రి చంద్రబాబే దగ్గర ఉండి హత్యలు చేయిస్తున్నారని తాను చెప్పిన తర్వాత సునీత ప్రమేయం ఉండదని ఎలా అనుకుంటున్నారని ఆయన ఎదురు ప్రశ్నించారు.

 జగన్

జగన్

సునీతతో సహా అందరి ప్రమేయం ఉందని ఆరోపించారు. గతంలో తాము కేంద్ర హోం మంత్రిని కూడా కలిశామని ఆయన చెప్పారు. మీ తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన హత్యలతో పోలిస్తే, ఇప్పుడు చాలా తక్కువేనని టీడీపీ నాయకులు అంటున్నారని ఒక విలేఖరి ప్రశ్నించగా.. మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ యజమానిని అడిగి తెలుసుకోవాలని జగన్ ఆ రిపోర్టర్‌తో అన్నారు.

English summary
YS Jagan accuses TDP of resorting to murder, intimidation against its rivals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X