వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపై ఎగిరిపడ్డ జగన్, స్త్రీ కాలుపైకి కారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనపై ఏడాదిలోపే ప్రజావ్యతిరేకత వచ్చిందన్నారు.

కర్నూలు జిల్లా పత్తికొండలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారన్నారు. ఫలితంగా టీడీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు.

మహిళ కాలుపైకి జగన్ కాన్వాయ్

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో జరిగిన పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. పట్టణంలోని కొండపేట సమీపంలో జగన్‌ను చూసేందుకు వచ్చిన ఆశాబీ అనే మహిళ జనం తోపులాటలో కిందపడ్డారు. ఇదే సమయంలో కాన్వాయ్ వచ్చి.. ఆమె కాలుపైకి ఎక్కింది. ఆమెను పలువురు ఆసుపత్రికి తరలించారు.

జగన్

జగన్

అబద్దాలు, మోసపూరిత మాటలు, ప్రచార ఆర్భాటాలతో సాగుతున్న బాబు పాలనపట్ల ప్రజలు విసుగుచెందారని జగన్ అన్నారు.

జగన్

జగన్

విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ జరుగుతుండగా రైతు ఆత్మహత్యకు యత్నించాడని, ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోవద్దని వ్యాఖ్యానించడం విచారకరమన్నారు.

జగన్

జగన్

ప్రాజెక్టుల పూర్తి కోసం కాల్వలపై నిద్రపోతానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, గతంలో ప్రాజెక్టులను విస్మరించిన మీకు గ్రామాల్లోకి వచ్చే దమ్ము ఉందా అని జగన్ ప్రశ్నించారు.

జగన్

జగన్

రైతు రుణాలు రూ.87 వేల కోట్లు ఉన్నాయని, వీటిని సకాలంలో మాఫీ చేయకపోవడంతో లక్ష కోట్లకు చేరుకున్నాయన్నారు.

జగన్

జగన్

చంద్రబాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ప్రచారం చేశారని, కానీ ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయని మండిపడ్డారు.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పత్తికొండ సభలో మాట్లాడుతున్న దృశ్యం

English summary
YS Jagan accuses TDP of resorting to murder, intimidation against its rivals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X