వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో మన పరిస్థితి ఏమిటి?: జగన్ ఆరా, రోజాకు కొత్తగా బాధ్యత

నంద్యాల ఉప ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ పరిస్థితిపై కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల నుంచి సోమవారం ఆరా తీశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. పార్టీ పరిస్థితిపై కర్నూలు జిల్లా ఎమ్మెల్యేల నుంచి సోమవారం ఆరా తీశారు.

నంద్యాలలో మనం ఎక్కడ ఉన్నామని, వార్డుల వారీగా పరిస్థితి ఎలా ఉందని జగన్ ఎమ్మెల్యేలను అడిగారు. ఎమ్మెల్యేలు నంద్యాలకు వెళ్లి ఉప ఎన్నికలపై దృష్టి సారించాలని సూచించారు.

నంద్యాలపై ప్రశ్నిస్తారా?: శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కొత్త అస్త్రాలునంద్యాలపై ప్రశ్నిస్తారా?: శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కొత్త అస్త్రాలు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సోమవారం ఉదయం ఎమ్మెల్యేలు వెలగపూడి వచ్చారు. అప్పుడు కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

జాగ్రత్త.. ఇదీ పరిస్థితి

జాగ్రత్త.. ఇదీ పరిస్థితి

ఉప ఎన్నికల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, బాగా కష్టపడాలని ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. ఈ సందర్భంగా నంద్యాలకు వెళ్లి వచ్చిన నేతలు స్థానిక పరిస్థితులను అధినేతకు వివరించారు. టిడిపి పరిస్థితి ఎలా ఉంది, వైసిపి పరిస్థితి ఎలా ఉందో ఆయనకు క్లుప్తంగా చెప్పారు.

Recommended Video

YSRCP MLA Roja Says I Will Not Contest in Next Elections
బాధ్యతలు వీరివే.. రోజాకు కొత్తగా బాధ్యతలు

బాధ్యతలు వీరివే.. రోజాకు కొత్తగా బాధ్యతలు

ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అంజాద్ బాష, ముస్తఫా, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వీరికి అదనంగా శ్రీకాంత్ రెడ్డి, రోజా తదితర ఎమ్మెల్యేలకూ కొత్తగా బాధ్యతలు అప్పగించారు.

జగన్ రోడ్డు షో నిర్వహించాలని..

జగన్ రోడ్డు షో నిర్వహించాలని..

ఉప ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఆ నియోజకవర్గంలో జగన్‌ రోడ్‌ షో నిర్వహించడంతో పాటు, విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఇప్పటి నుంచే చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

అనంతరం వ్యక్తిగతంగా..

అనంతరం వ్యక్తిగతంగా..

ఆ తర్వాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరితో జగన్‌ భేటీ అయ్యారు. వారి నియోజకవర్గాల్లో స్థితిగతులు, ఇటీవల నిర్వహించిన వైసిపి ప్లీనరీ ప్రభావం ప్రజల్లోకి ఎలా వెళ్లింది? వంటి విషయాలపై మాట్లాడారు. పార్టీ ప్రకటించిన తొమ్మిది పథకాలను వచ్చే నెల నుంచి ప్రజల్లోకి విసృతంగా తీసుకువెళ్లేందుకు సిద్ధం చేసిన కార్యాచరణను ఖచ్చితంగా పాటించే విషయంపై జగన్‌ వారికి సూచన చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Monday asked Kurnool district MLAs about Nandyal by elections situation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X