వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది నా వల్ల కాదు: అఖిలప్రియ పేరెత్తని జగన్, అలా టిడిపి షాక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రచారంలో బుధవారం మంత్రి అఖిలప్రియ పేరును పెద్దగా తీయలేదు. ఆయన పదేపదే సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రచారంలో బుధవారం మంత్రి అఖిలప్రియ పేరును పెద్దగా తీయలేదు. ఆయన పదేపదే సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు.

బాబులా నా వద్ద డబ్బు లేదు, అంత దిగజారను: దోపిడీ లెక్క చెప్పిన జగన్!బాబులా నా వద్ద డబ్బు లేదు, అంత దిగజారను: దోపిడీ లెక్క చెప్పిన జగన్!

ఆ 102 నియోజకవర్గాల్లో ఏది?

ఆ 102 నియోజకవర్గాల్లో ఏది?

జగన్ రైతు నగరం, కానాల, కొట్టాల, జూలపల్లె, పసురుపాడు, తేళ్లపాడు తదితర గ్రామాల్లో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. టిడిపి ఎమ్మెల్యేలు గెలిచిన 102 నియోజకవర్గాల్లో గానీ, మంత్రుల ప్రలోభాలతో ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోగానీ అభివృద్ధి జరగడం లేదన్నారు.

చంద్రబాబు ఫోజులు

చంద్రబాబు ఫోజులు

నంద్యాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పోజు కొడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రజలంతా వాళ్ల ఎమ్మెల్యేలు ఎప్పుడు పోతారా అని ఎదురుచూస్తున్నారని సాక్షాత్తూ భూమా నాగిరెడ్డి బావమరిది అన్నారని దుయ్యబట్టారు. కనీసం అప్పుడన్నా ఉప ఎన్నికలు వస్తాయి, వైసిపి పోటీ పెడుతుంది, అప్పుడైనా చంద్రబాబు నిద్ర లేస్తారన్నది ప్రజల ఉద్దేశమన్నారు. చంద్రబాబు అబద్దాల కోరు అన్నారు.

చంద్రబాబుకు ముని శాపం

చంద్రబాబుకు ముని శాపం

నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కనుక అది చేస్తా, ఇది చేస్తా అంటూ హామీలతో చంద్రబాబు మళ్లీ టేప్ రికార్డర్‌ ఆన్‌ చేశారని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఓ ముని శాపం ఉందని, పొరపాటున ఆయన నోటి వెంట నిజం వస్తే తలవేయి ముక్కలవుతుందని, అందుకే ఎప్పుడూ నిజం చెప్పరన్నారు.

నా వద్ద అలాంటి చానల్, పేపర్ లేదు, అది నా వల్ల కాదు

నా వద్ద అలాంటి చానల్, పేపర్ లేదు, అది నా వల్ల కాదు

చంద్రబాబులా తన వద్ద డబ్బులేదని, సీఎం పదవి లేదని, పోలీసు బలగాలు లేవని జగన్ అన్నారు. అదే సమయంలో తన వద్ద ఉన్నది లేనట్టు చూపించే మీడియా, టీవీ చానళ్లు, పేపర్లు లేవని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా తాను అబద్దాలు చెప్పలేనని జగన్ అన్నారు. అది నా వల్ల కాదన్నారు.

జగన్‌కు వ్యతిరేకంగా..

జగన్‌కు వ్యతిరేకంగా..

ఓ వైపు నంద్యాలలో వైయస్ జగన్ పర్యటిస్తుండగా, మరోవైపు పలువురు టిడిపి కార్యకర్తలు జగన్‌ను బాయ్ కాట్ చేయాలని ఆందోళన నిర్వహించారు. వారు జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. '60.. 60.. 120, వైయస్ జగన్.. 420' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

English summary
In a scathing attack, YSRC president YS Jaganmohan Reddy on Wednesday called Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu a “liar” and asked the people to dethrone him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X