వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తులపై రగడ: మీరే తీసుకోండంటూ జగన్ సవాల్

వైసిపి అధినేత జగన్ ఆస్తులపై ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం నాడు అధికార, విపక్ష సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.రెండు పార్టీల సభ్యులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొన్నారు. వైసిపి అధినేత జగన్

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:వైసిపి అధినేత జగన్ ఆస్తులపై ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో మంగళవారం నాడు అధికార, విపక్ష సభ్యుల మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.రెండు పార్టీల సభ్యులు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొన్నారు. వైసిపి అధినేత జగన్ కు, మంత్రి అచ్చెన్నాయుడుకు మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.

మంగళవారం నాడు ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయం నుండే గందరగోళం చోటుచేసుకొంది. ఈ గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను రెండు దఫాలు వాయిదా వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ys jagan challenged to tdp on his assets

అయితే సభ ప్రారంభమైన తర్వాత విద్యుత్ అంశంపై వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ చేసిన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. పవర్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని జగన్ ఆరోపణలు చేశారు. పవర్ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని జగన్ చేసిన ఆరోపణలపై అధికార పక్షం కూడ ధీటుగానే స్పందించింది.

మంత్రి అచ్చెన్నాయుడు జగన్ ఆరోపణలకు స్పందించారు. 43 వేల కోట్ల రూపాయాల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, అలాంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన అచ్చెన్నాయుడు ప్రత్యారోపణలు చేశారు.తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేలాది కోట్ల రూపాయాలను జగన్ సంపాదించాడని అచ్చెన్నాయుడు ఆరోపణలు చేశారు.ఐదేళ్ళలో వేలాది కోట్ల రూపాయాలు జగన్ కు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన జగన్ ను ప్రశ్నించారు.హైద్రాబాద్ లో లోటస్ పాండ్, బెంగుళూరులో ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. సోనియాకు పాదాభివందనం చేసి బెయిల్ తెచ్చుకొన్నారని ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు.

తనపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలపై జగన్ కూడ తీవ్రంగానే స్పందించారు. తాను వేలాది కోట్ల రూపాయాలను సంపాదించానని టిడిపి సభ్యులు ఆరోపణలు చేస్తున్నారన్నారు. టిడిపి సభ్యులు చెబుతున్నట్టుగా తనకున్న 43 వేల కోట్లలో పది శాతం తనకు ఇచ్చేసి మిగతా ఆస్తులన్నీ టిడిపికే రాసిస్తానని జగన్ సవాల్ విసిరారు. ఈ మేరకు ఎక్కడ సంతకాలు పెట్టమంటే సంతకాలు పెడతానని జగన్ ఆవేశంగా చెప్పారు.

తాను కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాతే తనపై కేసులు బనాయించారని జగన్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై టిడిపి ఈ కేసులను వేయించిందని ఆయన చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడు ఈ కేసు వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.వైఎస్ బతికున్నంత కాలం పాటు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం మంచి వాళ్ళమే,. పార్టీ మారగానే చెడ్డవాళ్ళుగా మారిపోయామా అంటూ జగన్ ప్రశ్నించారు.పార్టీ మారగానే అవినీతిపరుడిగా ఎలా అయ్యానని ఆయన అధికార పార్టీని ప్రశ్నించారు.తనపై 11 చార్జీషీట్లలో 1200 కోట్ల రూపాయాలు అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, ఇవి కూడ రుజువు కాలేదని జగన్ చెప్పారు..

English summary
ys jagan challenged to tdp on his assets in assembly on tuesday.jagan reacted minister atchannaidu allegations in assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X