అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోటస్ పాండ్‌తో సహా 749 కోట్ల ఆస్తుల అటాచ్: మాట్లాడేందుకు జగన్ నిరాకరణ

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ కేసులో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ అటాచ్‌మెంట్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వైయస్ జగన్‌కు చెందిన సుమారు రూ. 749 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది.

jaganhouse

వీటిలో హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని జగన్ నివాసం లోటస్ పాండ్ భవనంతో పాటు, బంజారాహిల్స్‌లోని సాక్షి కార్యాలయం, బెంగుళూరులోని బన్నేరుఘట్ట రోడ్డులోని ఖరీదైన వాణిజ్య సముదాయ భవంతి మంత్రీ ఎట్ కామర్స్‌ ఉన్నాయి. దీంతో పాటు పలు కంపెనీల్లోని జగన్, భారతీల షేర్లను ఈడీ అటాచ్ చేసింది.

మనీలాండరింగ్‌లో జగన్‌కు మరో షాక్: రూ.232 కోట్ల ఆస్తులు అటాచ్మనీలాండరింగ్‌లో జగన్‌కు మరో షాక్: రూ.232 కోట్ల ఆస్తులు అటాచ్

భారతి సిమెంట్స్ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు చేసిన ఈడీ భారీగా ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. భారతి సిమెంట్స్‌కు రూ. 152 కోట్ల సున్నపురాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లుగా ఈడీ నిర్ధారించింది. ఈ ఆటాచ్‌మెంట్‌తో జగన్ అక్రమాస్తుల కేసులో కుటుంబ సభ్యులతో ఉన్న ఆస్తులన్నీ అటాచ్ అయినట్లుగా తెలుస్తోంది.

51కోట్ల ఆస్తుల అటాచ్‌పై స్టే: జగన్‌కు తాత్కాలిక ఊరట 51కోట్ల ఆస్తుల అటాచ్‌పై స్టే: జగన్‌కు తాత్కాలిక ఊరట

Ys Jagan DA case: ED attaches Rs 749 cr property on wednesday

ఈ కేసులో ఇప్పటివరకు జగన్‌కు సంబంధించిన ఆస్తులను నాలుగుసార్లు ఈడీ అటాచ్ చేసింది. మొదటి విడతలో భాగంగా 200 కోట్లు, రెండో విడదలో భాగంగా 43 కోట్లు, మూడో విడతలో 225 కోట్లు, నాల్గవ విడతలో భాగంగా రూ. 749 కోట్ల స్థిరాస్తులను ఈడీ జప్తుకు ఆదేశించింది.

అయితే నాల్గవసారి జప్తు చేసిన ఆస్తుల్లో వైయస్ జగన్‌కు చెందిన వ్యక్తిగత ఆస్తులు ఉండటం విశేషం. నాలుగు విడతల్లో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మొత్తం రూ. 1200 కోట్లుకు పైగా ఆస్తులను జప్తు చేసింది. సీబీఐ నమోదు చేసిన చార్జిషీటు ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసులో ఆస్తులను జప్తు చేస్తోంది.

జగన్ ఆస్తుల కేసు: బదలీ చేయమని ఈడీకి సిబిఐ కోర్టు షాక్జగన్ ఆస్తుల కేసు: బదలీ చేయమని ఈడీకి సిబిఐ కోర్టు షాక్

జగన్ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసిన నేపథ్యంలో వీటికి సంబంధించి ఎలాంటి క్రయవిక్రయాలు జరిపినా ఈడీకి తెలియజేయాల్సి ఉంటుంది. బుధవారం చేసిన ఆస్తుల జప్తులో పెద్దమొత్తంలో జగన్‌ వ్యక్తిగత ఆస్తులు ఉండటం విశేషం. భవిష్యత్తులో మరికొన్ని ఆస్తులు అటాచ్‌మెంట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆస్తుల జప్తుపై స్పందించేందుకు నిరాకరించిన జగన్

సుమారు రూ. 749 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసిన అంశంపై వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించేందుకు నిరాకరించారు.

జగన్ సంస్థ లన్నింటినీ మూసివేయాలి: మంత్రి రావెల

వైసీపీ అధినేత వైయస్ జగన్‌కు చెందిన రూ.749 కోట్ల ఆస్తుల ఈడీ అటాచ్ మెంట్‌ను స్వాగతిస్తున్నామని ఏపీ మంత్రి రావెల అన్నారు. బుధవారం సాయంతంర్ ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ అవినీతి సామ్రాజ్యం కుప్పకూలుతోందనన్నారు.

వైయస్ జగన్ కరడుగట్టిన ఆర్థిక నేరస్తుడని, ఆయనకు చెందిన సంస్థలన్నింటినీ మూసివేయాలన్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని, పార్టీని కూడా త్వరలోనే మూసేయడం ఖాయమని అన్నారు.

English summary
The Enforcement Directorate on Wednesday attached immovable properties belonging to YS Jagan Mohan Reddy worth Rs 749 crore in the disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X