వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ఢిల్లీ టూర్-ప్రశ్నలెన్నో: పంతం నెరవేరేనా, టిడిపి-బిజెపి మధ్య సర్దుకుందా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఢిల్లీ పోరాటం ద్వారా అయినా నెరవేరుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పైన జగన్ జాతీయ పార్టీ నేతలకు మూడు రోజులుగా ఫిర్యాదులు చేస్తున్న విషయం తెలిసిందే.

ఢిల్లీ వెళ్లిన జగన్ పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంతోను భేటీ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, ఆయన ఈ రెండేళ్ల కాలంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా అవినీతికి పాల్పడ్డారని, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని ఢిల్లీలో ఫిర్యాదు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి విఫలమయ్యారు. ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్న నేపథ్యంలో.. వారి పైన అనర్హత వేటు వేయించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టారు.

YS Jagan

ద్రవ్య వినిమయ బిల్లు సమయంలోను జగన్ ఆశలు అడియాసలయ్యాయి. ఇలా, రాష్ట్రంలో జగన్ అనుకున్న.. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు విషయంలో ఆయన ఆకాంక్ష నెరవేరలేదు. దీంతో ఆయన ఏకంగా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు.

కేంద్రమంత్రులకు, జాతీయ నాయకులకు.. చివరకు సీఈసీకి జగన్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జగన్ 'అనర్హత' ఆకాంక్ష నెరవేరుతుందా అనే చర్చ సాగుతోంది. ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ కూడా దొరకలేదు. జగన్ 'సేవ్ డెమోక్రసీ' పేరుతో ఢిల్లీలో పర్యటించారు.

రెండు రోజుల క్రితం జగన్ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. రాజ్‌నాథ్ సింగ్.. జగన్‌కు అపాయింటుమెంటు ఇవ్వడంపై టిడిపి నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దోచుకున్న జగన్‌కు కలిసే అవకాశమివ్వడం ఏమిటని ప్రశ్నించారు.

గురువారం లోకేష్ మాత్రం.. కేంద్రమంత్రులు జగన్‌కు అపాయింటుమెంట్ ఇవ్వలేదని, పార్లమెంటు సెంట్రల్ హాలులో కలిశారని చెబుతున్నారు. మరోవైపు, జగన్‌కు ప్రధాని అపాయింటుమెంట్ లభించలేదు. టిడిపి - బిజెపి మిత్రపక్షమైనందునే తనకు ప్రధాని అపాయింటుమెంట్ లభించలేదేమోనని జగన్ అనుమానం వ్యక్తం చేశారు.

ఇలా, ఢిల్లీలో జగన్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదరణ లభించిదా లేక నిరాధరణ లభించిందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. లోకేష్, జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే జగన్‌కు ఆదరణ లభించలేదని అర్థమవుతోందని అంటున్నారు.

అదే సమయంలో, ఏపీలో టిడిపి, బిజెపిల మధ్య విభేదాలు రాజుకుంటున్నాయని గుర్తు చేస్తున్నారు. బిజెపి నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి నేతలు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు కురిపిస్తున్నారు. జగన్ తెచ్చిన పుస్తకం ద్వారా ఈ నేతలు మరింత రెచ్చిపోవచ్చునని భావిస్తున్నారు.

అయితే, ప్రధాని మోడీ అపాయింటుమెంట్ దొరకకపోవడం వంటి వాటిని చూస్తుంటే బిజెపి - టిడిపి మధ్య మళ్లీ సర్దుకుంటుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. జగన్ కోరుకున్నట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన చర్యలకు అవకాశం కూడా లేకపోవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
YSRCP chief YS Jaganmohan Reddy Delhi tour left many doubts!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X