హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ కేసు నవంబర్ 20కి వాయిదా, గాలి రిమాండ్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్ జగన్ అక్రమాస్తుల కేసుపై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. సబితా ఇంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఆయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, పునీత్ దాల్మియా, ఐఎస్ఎస్‌లు శాంబాబు, శామ్యూల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

ఈ కేసు విచారణను సీబీఐ కోర్డు నవంబర్ 20వ తారీఖుకి వాయిదా వేసింది. హుధుద్ తుపాను బాధితుల పరామర్శ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి వైయస్ జగన్‌కు మినహాయింపు పొందారు.

ys jagan Disproportionate Assets Case Postponed to November 20

వైయస్ జగన్ హుధుద్ తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని అరసవెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు.

ఉత్తరాంధ్రలో హుధుద్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో గత 8 రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు.

గాలి జనార్ధన్ రెడ్డి రిమాండ్ నవంబర్ 20 వరకు పొడిగింపు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాల కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం స్పష్టం చేసింది. కొందరు నిందితులు జైళ్లోనే ఉన్నందున విచారణ త్వరగా చేపట్టాలని, డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేయాలనుకునే వారు త్వరగా వేయాలని న్యాయమూర్తి బాలయోగి సూచించారు.

కృపానందం, రాజగోపాల్‌ల డిశ్చార్జ్ పిటిషన్లను విచారణను కోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, రాజగోపాల్ విచారణకు హాజరయ్యారు.

మరో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మీ అనారోగ్యం కారణంగా రాలేకపోయినట్లు పిటిషన్ దాఖలు చేసింది. దీనికి గాను కోర్టు అనుమతిచ్చింది.

English summary
YSR Congress Party President YS Jagan Disproportionate Assets Case Postponed to November 20.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X