హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు షాక్!: భారతికి ఆరేళ్ల తర్వాత.. జగన్ ఈడీ లేఖపై కదిలిన మోడీ?

ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీతో దోస్తీని కొనసాగించేందుకు టీడీపీ చూస్తోంది. బీజేపీలోని కొందరు నేతలు మాత్రం ఆ పార్టీకి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీతో దోస్తీని కొనసాగించేందుకు టీడీపీ చూస్తోంది. బీజేపీలోని కొందరు నేతలు మాత్రం ఆ పార్టీకి దూరం జరిగే ప్రయత్నాలు చేస్తున్నారు.

టిడిపి నుంచి వాకాటి సస్పెన్షన్: ఆ డబ్బు వారి చేతుల్లోకి.. మోడీకి మళ్లీ బాబు ఝలక్టిడిపి నుంచి వాకాటి సస్పెన్షన్: ఆ డబ్బు వారి చేతుల్లోకి.. మోడీకి మళ్లీ బాబు ఝలక్

అదే సమయంలో వైసిపి అధినేత జగన్ ప్రధాని నరేంద్ర మోడీని కలవడం రాజకీయ చర్చకు దారి తీసింది. దీనిపై టిడిపి, వైసిపి, బిజెపిల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఏపీలో రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయో సస్పెన్స్‌గా మారింది.

షాకింగ్ కథనం

షాకింగ్ కథనం

ఇలాంటి సమయంలో ఓ ఆంగ్లపత్రికలో షాకింగ్ కథనం వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారులపై జగన్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. దీని ఆధారంగా ఓ కథనం వచ్చిందని తెలుస్తోంది.

ఈడీ అధికారులు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని జగన్ ప్రధాని మోడీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ లేఖపై ఢిల్లీ స్థాయిలో కదలిక వచ్చిందని తాజా కథనం.

చెన్నై కార్యాలయానికి ఆదేశాలు

చెన్నై కార్యాలయానికి ఆదేశాలు

ఢిల్లీలోని ఈడీ కార్యాలయం దీనిపై స్పందించిందని చెబుతున్నారు. జగన్ ఆరోపించినట్లుగా హైదరాబాదులోని ఇద్దరు ఈడీ అధికారులు ప్రతిపక్ష నేతకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నారో చూడాలని చెన్నైలోని ఈడీ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసిందంటున్నారు. మోడీకి జగన్ ఫిర్యాదు నేపథ్యంలో ఇది చోటు చేసుకుందని పేర్కొంటున్నారు.

ఆస్తుల అటాచ్‌పై పదే పదే ప్రకటనలని..

ఆస్తుల అటాచ్‌పై పదే పదే ప్రకటనలని..

గతంలో మోడీకి జగన్ లేఖ రాసిన కీలక అంశాలను పేర్కొంది. హైదరాబాదులో పని చేస్తున్న ఇద్దరు ఈడీ అధికారులు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నారని లేఖలో జగన్ ఆరోపించారని పేర్కొంది. కేవలం టిడిపికి లబ్ధి చేకూర్చేందుకు, వైసిపి పరువు తీసేందుకు అవసరం లేకపోయినా పదేపదే ఆస్తుల అటాచ్‌పై ప్రకటనలు చేస్తున్నారని జగన్ పేర్కొన్నారని తెలిపింది.

భారతికి ఆరేళ్ల తర్వాత నోటీసులు

భారతికి ఆరేళ్ల తర్వాత నోటీసులు

గతంలో తన ఆస్తులపై సీబీఐ దాడులు జరిగినా తన కుటుంబాన్ని విధించలేదని, కానీ ఇప్పుడు మాత్రం వేధిస్తున్నారని, తన భార్య భారతికి ఆరేళ్ల తర్వాత జారీ చేస్తున్నారని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

డిప్యూటేషన్ ముగిసినా..

డిప్యూటేషన్ ముగిసినా..

అంతేకాదు, హైదరాబాదులో పని చేస్తున్న కొందరు ఈడీ అధికారుల డిప్యూటేషన్ కాల పరిధి మిగిసినా ఇక్కడే ఉండటాన్ని కూడా మోడీ దృష్టికి జగన్ తీసుకు వెళ్లారు. వారికి టిడిపి అధినేతతో ఉన్న సంబంధాలపై విచారణ జరిపించాలని కోరారు. జగన్ రాసిన లేఖను ఆర్థిక శాఖకు సిఫార్సు చేశారని తెలుస్తోంది. దీంతో ఈడీ హెడ్ క్వార్టర్ రంగంలోకి దిగిందని వార్తలు వస్తున్నాయి.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy wrote letter to PM Modi against Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X