వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడి నుంచి పాదయాత్ర పర్యవేక్షణ, జగన్‌కు చెక్ చెప్పేందుకు టిడిపి వ్యూహాలు

వైసిపి అధినేత జగన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభించే పాదయాత్రకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ కేంద్రాన్ని (సెంటర్) ఏర్పాటు చేయాలని వైసిపి నిర్ణయించింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత జగన్ అక్టోబర్ 27 నుంచి ప్రారంభించే పాదయాత్రకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు. పాదయాత్ర నిరంతరం పర్యవేక్షించేందుకు ఓ కేంద్రాన్ని (సెంటర్) ఏర్పాటు చేయాలని వైసిపి నిర్ణయించింది.

భూమా అడిగారు, శిల్పా అడగలేదు: బాబు ఆగ్రహం, మహిళ కంటతడిభూమా అడిగారు, శిల్పా అడగలేదు: బాబు ఆగ్రహం, మహిళ కంటతడి

ఈ కేంద్రం నుంచి జగన్ పాదయాత్ర తీరుతెన్నులను పర్యవేక్షిస్తారు. తాడేపల్లిలో వైసిపి కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి పర్యవేక్షించాలని తొలుత భావించారు. కానీ దాని నిర్మాణం పూర్తయ్యేసరికి సమయం పట్టనుంది.

బందర్ రోడ్డుకు షిఫ్ట్

బందర్ రోడ్డుకు షిఫ్ట్

దీంతో విజయవాడ బందర్ రోడ్డులో తాత్కాలిక కార్యాలయాన్ని సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. మాజీ మంత్రి, వైసిపి నేత పార్థసారథికి చెందిన స్థలంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి, ఇక్కడి నుంచి జగన్ పాదయాత్రను పర్యవేక్షించనున్నారు. ఈ నెల 28వ తేదీన తాత్కాలిక కార్యాలయానికి పూజలు చేయనున్నారని తెలుస్తోంది.

Recommended Video

Chandrababu Fixed YS Jagan And Pawan Kalyan For 2019 Polls
కార్యక్రమాలు అప్పటి నుంచి.. ప్రశాంత్ కిషోర్ టీంకు కూడా..

కార్యక్రమాలు అప్పటి నుంచి.. ప్రశాంత్ కిషోర్ టీంకు కూడా..

విజయ దశమి నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. పాదయాత్ర సమయంలో స్థానిక నాయకులతో ఇక్కడి కో ఆర్డినేట్ చేయనున్నారు. మరోవైపు, పాదయాత్ర మాత్రమే కాకుండా శాశ్వత భవనం పూర్తయ్యేదాకా ఇక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని వైసిపి భావిస్తోందని తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఈ తాత్కాలిక కార్యాలయాన్ని ఉపయోగించుకోనుందని తెలుస్తోంది.

జగన్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహాలు

జగన్‌ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు వ్యూహాలు

జగన్ పాదయాత్ర, అధికారంలోకి వస్తే ఏం చేస్తానని చెబుతూ 9 పథకాలు ప్రకటించిన నేపథ్యంలో వైసిపికి చెక్ చెప్పేందుకు చంద్రబాబు పథకరచన చేస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. పాదయాత్ర ప్రారంభిస్తే ఈ అంశాలనే జగన్ ప్రధానంగా ప్రజల ముందుకు తీసుకెళ్లనున్నారు.

వ్యూహాలు సిద్ధం చేసే పనిలో టిడిపి

వ్యూహాలు సిద్ధం చేసే పనిలో టిడిపి

ఈ నేపథ్యంలో పాదయాత్రలో జగన్ తాను ఇచ్చిన హామీలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారని, వాటికి చెక్ చెప్పేందుకు ఏం చేయాలనే అంశంపై టిడిపి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారంటున్నారు. తాము గతంలో ఇచ్చిన హామీలను జగన్ ఇప్పుడు ఇచ్చారని వైసిపి ప్లీనరీ సమయంలోనే టిడిపి నేతలు కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. కానీ దానికి అంత స్పందన కనిపించలేదు. దీంతో జగన్ పాదయాత్రపై టిడిపి వ్యూహాలు సిద్ధం చేసుకునే పనిలో పడిందంటున్నారు.

English summary
YSR Congress Party is planning to build temporary building to monitor YS Jaganmohan Reddy padayatra. Telugu Desam Party is chacking out to counter YSRCP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X