వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోదా కోసం ఢిల్లీలో ధర్నా, స్పందించేది నేనే: వైయస్ జగన్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.

అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్ర ఏడో రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తానే మొదటగా స్పందిస్తానని చెప్పారు.

కేంద్రం, చంద్రబాబు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదనీ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది తమ పార్టీనేనని చెప్పారు.

రుణమాఫీ పేరుతో ఏపి సిఎం చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలను మోసం చేశారనీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ నిర్మూలన పేరుతో యువతను మోసం చేశారని దుయ్యబట్టారు. రుణాలు మాఫీ చేయకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఉన్నా చాలామందికి ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఎందుకు ఇవ్వడంలేదని ఆరోపించారు.

పబ్లిసిటీ వచ్చేచోట మాత్రమే చంద్రబాబు పరిహారం ఇస్తారా? ఏ రైతు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నా పార్టీలతో సంబంధం లేకుండా 5 లక్షల పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికి నాలుగుసార్లు కేంద్ర హోం, ఆర్థిక మంత్రులను కలిశాననీ వైయస్ జగన్ తెలిపారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కేంద్రం దిగిరాకపోతే 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలతో ఢిల్లీలో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అనంతపురం జిల్లాలో రైతుభరోసా యాత్ర ఏడో రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా తానే మొదటగా స్పందిస్తానని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

కేంద్రం, చంద్రబాబు కళ్లు తెరిపించేలా ఉద్యమం చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏనాడూ ప్రతిపక్ష పాత్ర పోషించలేదనీ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా స్పందించేది తమ పార్టీనేనని చెప్పారు.

English summary
YSR Congress Party president YS Jaganmohan Reddy held Rythu Bharosa Yatra in Anantapur district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X