వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ బాగా నీరసించారు, గంట గంటకు పల్స్‌రేటు పడిపోతోంది: వైద్యులు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది. శనివారం ఉదయం ఆయనకు జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

దీక్ష కారణంగా వైయస్ జగన్ బాగా నీరసించిపోయారని, పల్స్ రేటు గంట గంటకు పడిపోతుందని తెలిపారు. కాగా, గుంటూరులోని నల్లపాడురోడ్డులో బుధవారం ప్రారంభించిన జగన్ దీక్షకు యువత నుంచి భారీ మద్దతు లభించింది.

పార్టీశ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచీ శుక్రవారం కూడా తరలి వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు స్వయంగా జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. గత రెండు రోజులకంటే శుక్రవారం పోలీసు బందోబస్తు పెరిగింది.

శుక్రవారం ఉదయం నుంచే మహిళలు సభాస్థలికి చేరుకున్నారు. ప్రభుత్వ వైద్యులు శుక్రవారం ఉదయం కూడా జగన్‌కు రక్త పరీక్షలు జరిపారు. జగన్ బాగా నీరసించారని వైద్యులు వెల్లడించారు.

శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌కు షుగర్ లెవల్స్ పడిపోయినప్పటికీ ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. కాగా, శనివారం పరీక్షించిన వైద్యులు జగన్ బాగా నీరసించిపోయారని, గంట గంటకు పల్స్ రేటు పడిపోతోందని చెప్పారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శనివారం నాటికి నాలుగోరోజుకు చేరుకుంది.

వైయస్ జగన్

వైయస్ జగన్

శనివారం ఉదయం ఆయనకు జీజీహెచ్ వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

గుంటూరులోని నల్లపాడురోడ్డులో బుధవారం ప్రారంభించిన జగన్ దీక్షకు యువత నుంచి భారీ మద్దతు లభించింది.

వైయస్ జగన్

వైయస్ జగన్

పార్టీశ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచీ శుక్రవారం కూడా తరలి వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలు స్వయంగా జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు.

English summary
The indefinite hunger strike launched here by YSR Congress President Y S Jaganmohan Reddy on the promise of special status made to Andhra Pradesh entered the third day today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X