వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'నంద్యాలలో శిల్పా మోహన్ రెడ్డికి జగన్ దెబ్బ, బ్రహ్మానంద రెడ్డిదే గెలుపు'

నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేయడం ఖాయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. ఈ రెండు ఫలితాల తర్వాత వైసిపిలో ముసలం ఖాయమని అభిప్రాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప చుట్టేయడం ఖాయమని మంత్రి పత్తిపాటి పుల్లారావు జోస్యం చెప్పారు. ఈ రెండు ఫలితాల తర్వాత వైసిపిలో ముసలం ఖాయమని అభిప్రాయపడ్డారు..

జగనే నా వద్దకు వచ్చారు, పార్టీలోకి రమ్మంటే నో చెప్పా: రామకృష్ణా రెడ్డి, అఖిల ఆనందంజగనే నా వద్దకు వచ్చారు, పార్టీలోకి రమ్మంటే నో చెప్పా: రామకృష్ణా రెడ్డి, అఖిల ఆనందం

బెదిరించి ఓట్లు వేయించుకోవాలని

బెదిరించి ఓట్లు వేయించుకోవాలని

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు కూడా కరువు అవుతారని పత్తిపాటి చెప్పారు. జగన్ ఓటమి ఒత్తిడితో ప్రజలను కూడా బెదిరించి ఓట్లు వేయించుకోవాలని చూస్తున్నారని పత్తిపాటి ఆరోపించారు.

Recommended Video

Kakinada Municipal Corporation Elections : Chandrababu Naidu Strategy Planning
నంద్యాలలో వైసిపి గ్రాప్ పడిపోతుంది

నంద్యాలలో వైసిపి గ్రాప్ పడిపోతుంది

నంద్యాలలో రోజు రోజుకు పడిపోతున్న గ్రాఫ్ చూసి వైసిపి నేతలు అసహనంతో అరాచకాలు చేయాలని చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. అరాచకవాదులకు ఓటు వేయాలో, అభివృద్ధికి ఓటు వేయాలో నంద్యాల, కాకినాడ ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు.

జగన్ ప్రచారమే శిల్పా మోహన్ రెడ్డికి నష్టం చేసింది

జగన్ ప్రచారమే శిల్పా మోహన్ రెడ్డికి నష్టం చేసింది

నంద్యాల ఎన్నికల్లో జగన్‌ సెల్ఫ్‌గోల్‌ చేసుకున్నారని, అక్కడ టిడిపి గెలవబోతోందని టిడిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారని చెబుతున్నారు. జగన్‌ ప్రచారమే వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి నష్టం చేసిందన్నారు.

శిల్పాకు అదే దెబ్బ

శిల్పాకు అదే దెబ్బ

ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని, ఉరి తీయాలంటూ జగన్‌ చేసిన ప్రచారమే వారికి శిల్పాకు బెడిసి కొట్టిందన్నారు. నంద్యాల ప్రజలు ఓటు అనే ఆయుధంతో వైసిపికి బుద్ధి చెప్పబోతున్నారని అన్నారు. పట్టిసీమ నిర్మించి రాయలసీమకు నీరిస్తే ఇప్పటికీ జగన్‌ దాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy selfgoal in Nandyal, saying Telugu Desam Party leaders. TDP leaders said that YSRCP graph growing down in Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X