వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరేడ్ గ్రౌండ్స్‌లో జెండా ఆవిష్కరించిన గవర్నర్: పార్టీ కార్యాలయాల్లో..(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, సీఎస్ రాజీవ్ శర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమయభావం వల్ల శకటాల ప్రదర్శనను రద్దు చేశారు.

తెలంగాణ భవన్‌లో..

తెలంగాణ భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.

తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజాదరణ పెరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నాయినితో పాటు డిప్యూటీ సీఎం మహముద్ అలీ పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరించిన వైయస్ జగన్

66వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలంయలో జరిగిన ఈ వేడుకలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తదితర నాయకులు హాజరయ్యారు.

బిజెపి కార్యాలయంలో 66వ రిపబ్లిక్‌ డే వేడుకలు

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న విషయం టిఆర్‌ఎస్‌ గ్రహించిందన్నారు. రాజయ్యను ఎందుకు బర్తరఫ్‌ చేశారో చెప్పాలన్న ఆయన మిగిలిన మంత్రులు అవినీతికి పాల్పడలేదా? అని ప్రశ్నించారు.

గాంధీ భవన్‌లో..

గాంధీ భవన్‌లో..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌.రమణ జాతీయ జెండాను ఎగురవేశారు.

దారుల్‌షిఫా..

దారుల్‌షిఫా..

జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ.

హైకోర్టులో..

హైకోర్టులో..

హైకోర్టు ఆవరణలో జెండా ఆవిష్కరించిన దృశ్యం. వేడుకలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

పరేడ్ గ్రౌండ్స్

పరేడ్ గ్రౌండ్స్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో 66వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

పరేడ్ గ్రౌండ్స్

పరేడ్ గ్రౌండ్స్

గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

పరేడ్ గ్రౌండ్స్

పరేడ్ గ్రౌండ్స్

గణతంత్ర వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, సీఎస్ రాజీవ్ శర్మ, పోలీసు ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్ పాల్గొన్నారు. సమయభావం వల్ల శకటాల ప్రదర్శనను రద్దు చేశారు.

అపోలో ఆస్పత్రలో..

అపోలో ఆస్పత్రలో..

హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో 66వ గణతంత్ర దినోత్సవం ఘనం జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది స్వచ్ఛభారత్ నిర్వహించారు.

అపోల ఆస్పత్రిలో..

అపోల ఆస్పత్రిలో..

హైదరాబాద్ నగరంలోని అపోలో ఆస్పత్రిలో 66వ గణతంత్ర దినోత్సవం ఘనం జరిగింది. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది స్వచ్ఛభారత్ నిర్వహించారు.

బిజెపి ఆఫీస్‌లో..

బిజెపి ఆఫీస్‌లో..

భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో..

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో..

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌.రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. పలువురు తెలంగాణ టిడిపి నేతలు ఈ వేడుకల్లో హాజరయ్యారు.

ప్రెస్ అకాడమీలో..

ప్రెస్ అకాడమీలో..

తెలంగాణ ప్రెస్ అకాడమీలో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ జెండా ఆవిష్కరించారు.

ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో 66వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్‌.రమణ జాతీయ జెండాను ఎగురవేశారు. పలువురు తెలంగాణ టిడిపి నేతలు ఈ వేడుకల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని విమర్శించారు.

తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌ పథకాలను అమలు చేస్తామని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్‌ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే డిప్యూటీ సీఎం రాజయ్యపై వేటు వేశారని ఆరోపించారు. ప్రభుత్వంలో ప్రతిపనికి డబ్బులు చేతులు మారుతున్నాయన్నారు. రాజయ్యను తొలగిస్తే అవినీతి అంతం కాదు అని వ్యాఖ్యానించారు. ఆరు జిల్లాల్లో టిడిపి నుంచి వెళ్లిన నేతలే టిఆర్‌ఎస్‌ను నడుపుతున్నారని ఎల్‌ రమణ అన్నారు.

గాంధీభవన్‌లో జెండా ఎగురవేసిన పొన్నాల

66వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ పిసిసి చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య గాంధీ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందన్నారు. ప్రభత్వం ఏం చేస్తుందో అర్థంకావటం లేదని విమర్శించారు.

కార్పొరేషన్‌ ఎన్నికల కోసం కులాలు, మతాలు ముందుకు తెస్తున్నారని పొన్నాల ఆరోపించారు. రాజయ్యను తొలగించి దళితుడిని బలి చేశారని మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌ ధ్వజమెత్తారు. స్వైన్‌ఫ్లూ నివారణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌ తెలంగాణ సిఎంను తప్పుదారి పట్టించారని దానం వ్యాఖ్యానించారు.

English summary
On the 66th Republic Day, YSR Congress Party president YS Jaganmohan Reddy unfurled the national flag in Lotus Pond, party office in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X