వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

20 ఏళ్ల తర్వాత శశికళ , జగన్ జైలుకు ఖాయం: చంద్రబాబు ఆగ్రహం

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఇరవై ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లారని, రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా జైలుకు వెళ్లాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబా

|
Google Oneindia TeluguNews

విజయవాడ: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి శశికళ ఇరవై ఏళ్ల తర్వాత జైలుకు వెళ్లారని, రూ.40 వేల కోట్ల అక్రమాలకు పాల్పడిన వైసిపి అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ కూడా జైలుకు వెళ్లాల్సిందేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు.

ఆయన చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. వారి సంక్షేమమే తనకు ముఖ్యమని చెప్పారు.

పట్టిసీమతో రాయలసీమ సస్యశ్యామలమవుతోందన్నారు. శ్రీశైలం మిగులు జలాలను రాయలసీమకు అందిస్తున్నామన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

YS Jagan will go jail soon, says Chandrababu

అంతకుముందు, జగన్ గుంటూరులో సీఎం చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు చూసి ఎన్టీఆర్ ఆథ్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని ధ్వజమెత్తారు. సీఐఐ సదస్సుపై సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు.

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పెట్టిన టిడిపి, తెలుగు ద్రోహుల పార్టీగా మారిందన్నారు. చంద్రబాబు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. కేంద్రం ఏ ఆట ఆడమంటే చంద్రబాబు ఆ ఆట ఆడుతున్నారన్నారు.

పళనిస్వామి కేబినెట్లో తొలిసారి గెలిచిన తెలుగోడికి ఛాన్స్పళనిస్వామి కేబినెట్లో తొలిసారి గెలిచిన తెలుగోడికి ఛాన్స్

హోదా కోసం వైసిపి ఎంపీలు రాజీనామాకు కూడా సిద్ధమని ప్రకటించారు. మహిళల పైన స్పీకర్ కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థించడం దారుణం అన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా హోదా పోరాటం ఆగదని చెప్పారు.

English summary
AP CM Chandrababu Naidu on Thursday said that YSRCP chief YS Jaganmohan Reddy will go to jail soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X