వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'హిందూ సంప్రదాయాలు జగన్ గాలికి, అందుకే..', బంద్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాము చేపట్టిన బంద్ కార్యక్రమం ఫుల్ సక్సెస్ అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబితే, బంద్ అట్టర్ ఫ్లాప్ అయిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు అన్నారు.

వైకాపా చేపట్టిన బంద్ ను జనాలు అస్సలు పట్టించుకోలేదన్నారు. రాఖీ పండుగ రోజు బంద్‌కు పిలుపునిచ్చి, హిందూ సాంప్రదాయాలను జగన్ గాలికొదిలేశారని మండిపడ్డారు.

తిరుమల కొండలు ఏడు కాదు, కేవలం రెండే అని గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఇలాగే చేశారని మండిపడ్డారు. జగన్ జైలుకెళ్లడం, ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కోవడం ఖాయమన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాకుండా ఉండటమే జగన్‌కు కావాలన్నారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసిపి శనివారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. చెదురు మదురు సంఘటనలు మినహా అంతా ప్రశాంతంగా ముసిగింది.

వైసిపి బంద్

వైసిపి బంద్

విశాఖపట్నం నగరంలో పెట్రోల్ బంక్‌లు, విద్యాసంస్థలు, వాణిజ్య సంస్థలు, సినిమా థియేటర్లు ఉదయం మూసివేశారు. ఆర్టీసీ సర్వీసులు, ఆటోలు యధాతథంగా నడిచాయి.

వైసిపి బంద్

వైసిపి బంద్

బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు కొంత సేపు మినహా పూర్తిగా పని చేశాయి. వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, సిపిఎం, సిపిఐ కార్యదర్శులు బి గంగారావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

ప్రత్యేక హోదాను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైసిపి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర బంద్ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రశాంతంగా ముగిసింది. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బంద్ జరిగింది.

వైసిపి బంద్

వైసిపి బంద్

ప్రత్యేక హోదా సాధన కోసం వైసిపి ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ కడప జిల్లాలో విజయవంతమైంది. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సులు సాయంత్రం వరకు డిపోలకే పరిమితమయ్యాయి.

వైసిపి బంద్

వైసిపి బంద్

హిందూపురంలో వైసిపి ఇన్‌ఛార్జి నవీన్ నిశ్చల్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తాము చేసిన బంద్ విజయవంతమైందని, ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరి అర్థమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అన్నారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

ఈ పోరాటం ఆగదని, మరింత ఉధృతం చేస్తామని ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

బంద్‌ను విజయవంతం చేసినందుకు ఆయన ప్రజలకు, వామపక్షాలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అందుకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. అసలు ప్రభుత్వం ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

ప్రత్యేక హోదాపై పోరాటం చేయకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు జగన్ ఆసక్తికరంగా స్పందించారు.

వైసిపి బంద్

వైసిపి బంద్

"నువ్వు ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైందబ్బా, రాజకీయం చేయవద్దు" అని జగన్ అన్నారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పేరును కూడా ఆయన ప్రస్తావించారు.

 వైసిపి బంద్

వైసిపి బంద్

బంద్‌ను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని, విజయవాడలో మంత్రివర్గ సమావేశం పెట్టి, జిల్లాలవారీగా సమీక్షిస్తూ ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు.

English summary
The State wide bandh on Saturday for which the YSR Congress has given a call and supported by left parties with the demand of immediate sanction of special category status to AP, was partial and peaceful barring a few incidents in the Vishaka city and district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X