హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు, అందుకే గైర్హాజరు ?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'కు మూడో దశకు తెరలేవనుంది. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ చేరేందుకు రంగం సిద్ధమయ్యారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జిల్లాకు చెందిన కందుకూరు, గిద్దలూరు ఎమ్మెల్యేలు పోతుల రామారావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలు టీడీపీ పసుపు పండుగ 'మహానాడు' తర్వాత ఆ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇందులో భాగంగానే గురువారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధి విజయసాయి రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వారిద్దరూ గైర్హాజరైనట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ విజయిసాయి రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి గైర్వాజరవడం వైసీపీలో పెద్ద చర్చనీయాశంగా మారింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి పార్టీ మారే విషయంలో ఇప్పటికే తమ అనుచరులతో సంప్రదింపులు జరిపినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముందుగా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తొలుత కుటుంబ సభ్యులు, బంధువర్గీయులతో మంతనాలు జరిపారు. ఆతర్వాత శ్రేయోభిలాషులతో సమాలోచనలు చేశారని తెలుస్తోంది.

ఆ తర్వాత తనకు మంచిపట్టున్న గిద్దలూరు, రాచర్ల మండలాలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులతో చర్చించారు. తన నియోజకవర్గంలోని మిగతా మండలాల నేతలతో శుక్రవారం సమావేశం కానున్నారని సమాచారం. ఇక కందుకూరు ఎమ్మెల్యే రామారావు టంగుటూరులో గురువారం తన వర్గీయులతో సమావేశమై చర్చించారు.

కందుకూరులోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో చేరాలనే ఆలోచనకు రావడానికిగల కారణాలను కార్యకర్తలకు వివరించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపుల్లో భాగంగా ఇప్పటి వరకు వైసీపీ నుంచి 16 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే.

 జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

తన ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ఉంటానని, వారితో తనకు మూడు తరాల అనుబంధం ఉందని విజయసాయిరెడ్డి చెప్పారు. గురువారం నామినేషన్ వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ తనపై గురుతర బాధ్యతను ఉంచి, రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

 జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

రాజ్యసభలో ప్రజల శ్రేయస్సుకు పనికి వచ్చే చట్టాల రూపకల్పనలో, వాటి అమలు విషయంలో ఒక ప్రతిపక్ష సభ్యుడిగా తన బాధ్యతను నిర్వహిస్తానని అన్నారు. చట్టసభల్లో విలువలు పడిపోతున్నాయని, వాటిని కాపాడడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. తన ఎంపికపై పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలంతా తన అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవంగా సమర్థించినందకు ధన్యవాదాలు తెలిపారు.

 జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

నిజాయతీ, విలువలకు కట్టుబడి మానవ సంబంధాల కోసం గట్టిగా నిలబడినందుకే విజయసాయిరెడ్డిని రాజ్యసభ అభ్యర్థిగా పార్టీ తరఫున ఎంపిక చేశామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ ప్రకటించారు. గురువారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపిన తరువాత విజయసాయిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

తనపై కొందరు కుట్రలు పన్ని, కుమ్మక్కై రాజకీయ దురుద్దేశంతో అక్రమ కేసులు బనాయించినప్పుడు దర్యాప్తు సందర్భంగా సాయిరెడ్డి నైతిక విలువలకే కట్టుబడ్డారని చెప్పారు. ఈ వ్యవహారంలో మొత్తం నెపాన్ని జగన్‌పై నెట్టేస్తే సాయిరెడ్డిని కేసుల్లో సాక్షిగానే ఉంచి ముద్దాయిగా చేయబోమని దర్యాప్తు సందర్భంగా విపరీతంగా ఒత్తిడి చేశారని, అయినా ఆయన లొంగకుండా న్యాయం వైపే నిలబడ్డారని కొనియాడారు.

 జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

ఈ వ్యవహారాల్లో ఎలాంటి పొరపాట్లు, తప్పులు జరగలేదని, జరిగిందే చెబుతాను గానీ, జరగనిది చెప్పబోనంటూ సాయిరెడ్డి దృఢంగా వ్యవహరించారని, విలువల కోసం ముద్దాయిగా మారడానికి కూడా సిద్ధపడ్డారని జగన్ పేర్కొన్నారు. మానవ సంబంధాలు, విశ్వాసానికి కట్టుబడిన వారికి వైఎస్సార్‌సీపీలో సముచిత స్థానం లభిస్తుందనే సందేశం ఇవ్వదలిచామన్నారు.

 జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

జగన్‌కు ప్రకాశం షాక్: టీడీపీలోకి మరో ఇద్దరు

ఒక్క మాట జగన్‌కు వ్యతిరేకంగా చెబితే వదలి వేస్తామని కొందరు ఒత్తిడి తెచ్చినా సాయిరెడ్డి విలువలకే కట్టుబడ్డారని తెలిపారు. విలువలకు కట్టుబడిన వ్యక్తులను వాడుకుని వదలి వేయడం కొందరి లాగా తనకు చేతకాదని, అది తన నైజం కూడా కాదని స్పష్టం చేశారు. మనుషుల మధ్య సంబంధాలను డబ్బుతో కొనేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

English summary
YSR Congress leader Venumbaka Vijay Sai Reddy on Thursday filed his nomination papers for the Rajya Sabha seat from Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X