వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దున్నపోతుల్లా మేపీ దొర్లించారు: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చెవిరెడ్డి, పెద్దాయనంటూ గిడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, విశ్వేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబునాయుడు ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చారని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేలా చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఇదొక నీతిమాలిన ప్రభుత్వమని దుయ్యబట్టారు.

భవిష్యత్ తరాలు చంద్రబాబును తుగ్లక్‌లా గుర్తుపెట్టుకుంటుందని, సభలో వికటకవిగా ఓ తెనాలి రామకృష్ణుడు ఉన్నాడని యనమలను ఉద్దేశించి అన్నారు. తమ పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను ప్లాన్ ప్రకారమే ఆస్పత్రిలో చేర్పించారని ఆరోపించారు. వారు ఆస్పత్రిలోని రోగులను కిందపడేసి దున్నపోతుల్లా మంచాలపై పడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మంచాలు కూడా వారికి సరిపోవడం లేదని అన్నారు. ఓటింగ్ కోసం ఎవరి సీట్లోకి వారు పోవాలంటూ చెప్పిన స్పీకర్.. చెడు ఆలోచనలు కలిగేలా వ్యవహరించారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై తాము న్యాయస్థానంను ఆశ్రయిస్తామని, ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే

మరో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన చంద్రబాబు.. తప్పించుకునేందుకు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారని ఆరోపించారు. దీంతో భవిష్యత్ తరాలకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారని మండిపడ్డారు. పిరికిపందల్లా పారిపోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.

అందరూ చూస్తుండగానే రూల్స్ లెక్కచేయకుండా చట్ట వ్యతిరేకంగా సభను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని దుయ్యబట్టారు. డివిజన్ ఉండకూడదని చెప్పి అవమానకర రీతిలో వ్యవహరించారని మండిపడ్డారు. సభను వాయిదా వేసుకుని వెళ్లిపోవడం దుర్మార్గమని అన్నారు. అయితే, ప్రజలు విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నాు.

YSR Congress Part MLAs fires at Chandrababu

అప్రజాస్వామికం

చంద్రబాబు ప్రభుత్వం అప్రజస్వామికంగా వ్యవహరిస్తోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం చెప్పేవన్నీ అవాస్తవాలనేని, టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వివాదాస్పద పట్టిసీమను కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే పూర్తి చేశారని ఆరోపించారు.

చంద్రబాబులు నూరు మందైన వైయస్‌కు సరిపోరని అన్నారు.
పరిశ్రమలకు రాయితీ ఇస్తామని కేంద్రం చెప్పలేదని, పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి మాటేలేదని మండిపడ్డారు. 75శాతం ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.

పెద్దాయన చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ప్రజాస్వామ్యం బద్దంగా పాలన సాగడం లేదని ఆరోపించారు. చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పాడేరు ఎమ్మెల్యే అని వ్యక్తిగతంగా ప్రస్తావించారని, తమకు మైకులివ్వడం లేదని, గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

సీఎం చంద్రబాబు వ్యక్తిగతంగా పాడేరు సంగతి చూస్తానంటూ హెచ్చరిస్తున్నారని అన్నారు. మహిళలు, గిరిజనులను భయపెడుతున్నారా? అని ప్రశ్నించారు. 35ఏళ్ల అనుభవం ఉన్న సీఎం.. గిరిజన మహిళను కించపరుస్తున్నారని అన్నారు. తనను టార్గెట్ చేసుకుంటున్నారని అన్నారు. తన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకుండా ఉద్యమం చేస్తున్నందుకే గొంతునొక్కేస్తున్నారని మండిపడ్డారు.

కొత్త ఎమ్మెల్యేలంటూ కించపరచొద్దని చంద్రబాబుకు ఆమె సూచించారు. ప్రజాసమస్యలపై ఈ కొత్త ఎమ్మెల్యేలే గళమెత్తుతున్నారని చెప్పారు. కక్షకట్టి మాట్లాడటం బాధాకరమని అన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదే? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, తమ ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. పెద్దాయన హోదా తగ్గించుకోకుండా అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించాలని కోరారు. వ్యక్తిగత దూషిణలు సరికాదని హితవు పలికారు.

English summary
YSR Congress Part MLAs Chevereddy Bhaskar Reddy and Srikanth REddy and others on Wednesday fired at Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X