వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలకు షాకిస్తారా?: 'నంద్యాలలో 25వేల మెజార్టీతో వైసిపి గెలుపు'

నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 వేల భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాలకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 25 వేల భారీ మెజార్టీతో గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాలకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.

నంద్యాల కోసం చంద్రబాబు రాయబారం, జగన్‌కు నో ఛాన్స్! నంద్యాల కోసం చంద్రబాబు రాయబారం, జగన్‌కు నో ఛాన్స్!

టిడిపి నుంచి శిల్పా మోహన్ రెడ్డి, మంత్రి అఖిల ప్రియ కుటుంబ సభ్యుల తొలుత రేసులో నిలిచారు. భూమా కుటుంబానికే టిక్కెట్ ఇస్తారని తెలియడంతో శిల్పా వైసిపిలో చేరారు. ఆయనకు వైసిపి నుంచి టిక్కెట్ దక్కనుంది.

ఏకగ్రీవం కోసం చంద్రబాబు సహా టిడిపి ప్రయత్నం

ఏకగ్రీవం కోసం చంద్రబాబు సహా టిడిపి ప్రయత్నం

నంద్యాల ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి అఖిలప్రియ సహా టిడిపి నేతలు అందరూ ప్రయత్నిస్తున్నారు. అయితే, వైసిపి అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవలే తమ పార్టీలో చేరిన శిల్పా మోహన్ రెడ్డిని వైసిపి బరిలోకి దింపే అవకాశముంది. శిల్పా కూడా టిక్కెట్ కోసమే ఆ పార్టీలో చేరారు.

ఎవరి లెక్కలు వారివి..

ఎవరి లెక్కలు వారివి..

నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని అధికార టిడిపి, ప్రతిపక్ష వైసిపి ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు విషయంలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయని చెప్పవచ్చు. నియోజకవర్గాలో భూమాకు, ఆయనకు ఉన్న పలుకుబడి, టిడిపి ఓటు బ్యాంకు తమను, అభివృద్ధి పనులు తమను గెలిపిస్తాయని అధికార పక్షం చెబుతోంది. అలాగే, గత ఎన్నికల్లో ఆ సీటు తమదేనని, అలాగే, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని వైసిపి చెబుతోంది.

అంతర్గతంగా...

అంతర్గతంగా...

వైసిపి పోటీకే మొగ్గు చూపుతుండటంతో ఉప ఎన్నిక అనివార్యం. ఈ నేపథ్యంలో వైసిపికి లోలోన కాటసాని రామిరెడ్డి భయం కనిపిస్తోందని అంటున్నారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డికి ఆయన మామ. కాబట్టి బయటకు వైసిపి అని చెప్పినప్పటికీ.. అంతర్గతంగా టిడిపికి మద్దతు ఇచ్చే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. మరోవైపు, నియోజకవర్గ ఇంచార్జి రాజగోపాల్ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు శిల్పాకు ఆయన కూడా ఎంత వరకు సహకరిస్తారనేది అనుమానమే అంటున్నారు.

వైసిపి ప్లీనరీలో ఉప ఎన్నిక ఉత్సాహం

వైసిపి ప్లీనరీలో ఉప ఎన్నిక ఉత్సాహం

నంద్యాల చెక్‌పోస్టు సమీపంలో ఉన్న ఫంక్షన్‌ హాల్‌లో వైసిపి జిల్లా ప్లీనరీ సమావేశం గురువారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్లీనరీలో ఎంపీ బుట్టా రేణుక, అనంత వెంకట్రామిరెడ్డి, గంగుల ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసిపిపై ప్రజాభిమానం ఉందని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జగన్‌ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.

కేఈపై విమర్శలు

కేఈపై విమర్శలు

తన కుమారుడి ఎదుగుదల కోసం కేఈ కృష్ణమూర్తి హత్యలు చేయించాడని, చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకేసులో అసలు నిందితుని అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని వైసిపి నేత అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. కేఈ కుమారుడిని అరెస్టు చేయకుంటే నిరాహార దీక్షలు చేస్తామని చ్చరించారు. కాగా, చెరుకులపాడు నారాయణతో పాటు హత్యకు గురైన సాంబశివుడి కుటుంబ సభ్యులకు పార్టీ నాయకులు ఆర్థిక సాయం అందించారు.

English summary
YSR Congress Party leaders saying that they will win Nandyal with 25,000 vote majority.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X