వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామ్‌నాథ్ కోవింద్..: నిన్న బాబు.. నేడు వైసిపి, జగన్ చెప్పారని మేకపాటి

ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఓ సెట్ నామినేషన్ సమర్పించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్‌నాథ్ కోవింద్ మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఓ సెట్ నామినేషన్ సమర్పించారు.

<strong>చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఝలక్</strong>చంద్రబాబుకు ఉండవల్లి అరుణ్ కుమార్ ఝలక్

ఈ సెట్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంతకం చేశారు.

వెంకయ్య, మేకపాటిల సంతకం

వెంకయ్య, మేకపాటిల సంతకం

వెంకయ్య, మేకపాటితో పాటు ఈ కార్యక్రమానికి మరో సీనియర్ కేంద్రమంత్రి అనంత్ కుమార్ హాజరయ్యారు. ఈ నెల 23వ తేదీన రామ్‌నాథ్ అట్టహాసంగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. బుధవారం నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడారు.

జగన్ ఆ రోజే చెప్పారు

జగన్ ఆ రోజే చెప్పారు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తామని తమ పార్టీ అధినేత జగన్ ఆ రోజే చెప్పారని, ఈ క్రమంలో సెట్ నామినేషన్లకు తమను ఆహ్వానించారని మేకపాటి అన్నారు.

మేకపాటి రెండో సంతకం

మేకపాటి రెండో సంతకం

వెంకయ్య నాయుడు తొలి సంతకం చేయగా, కోవింద్‌ను బలపరుస్తూ తాను రెండో సంతకం చేశానని మేకపాటి చెప్పారు. కోవింద్ అన్ని విధాలా అర్హుడైన అభ్యర్థి అని, ఇలాంటి పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే బాగుండేదన్నారు.

నిన్న చంద్రబాబు.. నేడు వైసిపి

నిన్న చంద్రబాబు.. నేడు వైసిపి

కాగా, రామ్‌నాథ్ కోవింద్ 23వ తేదీన నామినేషన్ దాఖలు చేసినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎ సెట్ పైన సంతకం చేశారు. ఇప్పుడు వైసిపి మేకపాటి చేత కూడా ఆయనను బలపరుస్తూ సంతకంచేశారు.

English summary
BJP-led NDA will file the fourth set of nomination papers of their presidential candidate Ram Nath Kovind with YSR Congress Party as the seconder after the latter formally agreed to support him even as the ruling alliance is in talks with other political parties to increase its strength.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X