వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షర్మిల మాటేమిటి? క్రిమినల్ రవికిరణ్‌కు జగన్ శాలరీ: టిడిపి సూటి ప్రశ్న

గతంలో వైసిపి అధినేత షర్మిల పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయలేదా అని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ప్రశ్నించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: గతంలో వైసిపి అధినేత షర్మిల పైన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయలేదా అని టిడిపి నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ప్రశ్నించారు. మీరు ఫిర్యాదు చేస్తే తప్పు లేదు కానీ మేం చేస్తే తప్పా అని ప్రశ్నించారు.

<strong>పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్</strong>పొలిటికల్ పంచ్ ఇలాగే: బాబుకు రవికిరణ్ షాక్, జగన్ సహా జైలుకెళ్తారని వార్నింగ్

పొలిటికల్ పంచ్‌కు చెందిన రవికిరణ్‌కు నేర చరిత్ర ఉందని సోమిరెడ్డి ఆరోపించారు. చర్లపల్లి జైలుకు వెళ్లి వచ్చిన కిరణ్‌కు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వైసిపి నేత విజయసాయి రెడ్డి మద్దతు తెలపడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.

జైలుకు వెళ్లక తప్పదు

జైలుకు వెళ్లక తప్పదు

బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని విజయ సాయి రెడ్డిని హెచ్చరించారు. అధికారులను బెదిరిస్తే జైలుకు వెళ్లక తప్పదని సోమిరెడ్డి చెప్పారు. అధికారులను బెదిరించడం రాజ్యసభ సభ్యులకు హుందాతనం కాదని హితవు పలికారు. షర్మిలపై పోస్టులు పెట్టినప్పుడు మీరెలా ఫిర్యాదు చేశారన్నారు.

లోకేష్‌ను అలా చూపిస్తారా?

లోకేష్‌ను అలా చూపిస్తారా?

సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకుని అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సోమిరెడ్డి హెచ్చరించారు. శాసనమండలిని, మంత్రి లోకేశ్‌ను సోషల్‌ మీడియాలో అసభ్యంగా చూపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

రవికిరణ్‌కు వైసిపి జీతం

రవికిరణ్‌కు వైసిపి జీతం

సోషల్ మీడియాను వైసిపి సొంత మీడియాగా వాడుకుంటోందన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్న రవికిరణ్‌కు వైసిపి జీతం ఇస్తోందని ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా రవికిరణ్‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తే జగన్‌, విజయ్ సాయిరెడ్డి ప్రభుత్వాన్ని, పోలీసులను బెదిరించడమేమిటని ప్రశ్నించారు.

రవికిరణ్ జైలుకు వెళ్లి వచ్చాడు

రవికిరణ్ జైలుకు వెళ్లి వచ్చాడు

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు వ్యతిరేకం కాదని సోమిరెడ్డి స్పష్టం చేశారు. అయితే, అసభ్య వ్యాఖ్యలు చేస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు.

2014లోనే రవికిరణ్ 14 రోజులు జైలులో ఉన్నారని చెప్పారు. అలాంటి క్రిమినల్ బ్యాంక్ గ్రౌండ్ ఉన్న వారిని వెనుకేసుకొస్తారా అన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని చెప్పారు. దోచుకోవడం,దాచుకోవడం జగన్‌కు అలవాటేనని ఎద్దేవా చేశారు.

English summary
YSRCP gave complaint when posts against YSRCP leader Sharmila in social media, says Telugudesam Party leader and Minister Somireddy Chandramohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X