వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషికేశ్వరి కేసులో అసెంబ్లీ ప్రాంగణంలో ఫోటోలు చూపించిన రోజా (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శానస సభ సమావేశాలు వాడిగావేడిగా సాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు వైయస్ చిత్రపటం తొలగింపు, పట్టిసీమ తదితర అంశాల పైన చర్చించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో జల సంకల్పం చేపట్టామని, రాష్ట్రం అంతా అందరికీ సాగునీరు, తాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

గత 14 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకు 8567 కోట్లు ఖర్చు చేశామని, పోలవరం ప్రాజెక్టుకు రావల్సిన అన్ని అనుమతులు లభించాయని, 2018 నాటికి పోలవరం పూర్తి చేసి తీరుతామన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

పట్టిసీమ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తిచేసిన స్ఫూర్తితో మిగిలిన ప్రాజెక్టులను సైతం పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. బుధవారం శాసనసభలో పట్టిసీమపై జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం జవాబిచ్చారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

68 లక్షల ఎకరాలకు నీరు అందించాల్సి ఉండగా, కేవలం 18 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందుతోందని, నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, మరో పక్క వేల టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తోందని, ఆ జలాల్లో వందల టిఎంసిలు వాడుకున్నా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

గత ఏడాది 693 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇస్తే రైతులకు 5వేల కోట్ల రూపాయిల నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకే అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు భగీరధ ప్రయత్నం ప్రారంభించామన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వానికి స్పష్టత ఉందని, పులిచింతల ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం 246 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను పూర్తి చేస్తే 40 టిఎంసిలను నిల్వ చేసే వీలుకలుగుతుందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంలో, ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి సాగునీటి సమస్య లేకుండా చూసే బాధ్యత టిడిపిపై ఎక్కువగా ఉందని, ఉభయ గోదావరి జిల్లాల్లో రెండో పంటకు నీళ్లిచ్చామని, మూడో పంట కూడా వేసుకోమని చెబుతున్నామని, గోదావరి నీళ్లు తగ్గినా, సీలేరు నుండి నీళ్లు అందిస్తామన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

రాయలసీమలో హంద్రీనీవాకు 665.66 కోట్లు, గాలేరు నగరికి 267.70 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు ఇంత వరకూ 705 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. కృష్ణా గోదావరి జలాలను అనుసంథానం చేసిన ఘనత తమకే దక్కుతుందన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల్లో ఎక్కడ అవినీతి జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రైతలు చాలా ఆనందంగా ఉన్నారని, ప్రాజెక్టులను పరిగెత్తించే పరిస్థితి తెచ్చామని పేర్కొన్నారు. 2004 నుండి 2014 వరకూ అప్పటి కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టుకు 255 కోట్లు ఖర్చు చేసిందని, తాము రెండేళ్లలో 246 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ఏపీ అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ

పట్టిసీమ ద్వారా కనీసం 20-30 టిఎంసిల నీటిని వాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశామని నాలుగేళ్లపాటు సముద్రంలో కలిసిపోయే జలాలను సాగుకు వినియోగించుకుంటున్నామని అన్నారు. అలాగే ఉత్తరాంధ్రను ఆదుకునేందుకు సోంపేట- ఇచ్చాపురం మధ్య బ్యారేజీ నిర్మించే ఆలోచన ఉందని, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని, 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.

English summary
AP Assembly was adjourned for 15 minutes after slogan shouting YSR Congress Party members disrupted the Question Hour proceedings on Thursday demanding the Government to control rising prices of essential commodities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X