వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు గుర్నాథర్‌ రెడ్డి షాక్: మిస్సమ్మ బంగ్లా కారణమా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

అనంతపురం: అనంతపురం జిల్లాకు చెందిన గుర్నాథ్‌రెడ్డి టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీతతో గుర్నాథరెడ్డి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని సమాచారం.తన వర్గీయులతో గుర్నాథ్‌రెడ్డి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

అనంతపురం జిల్లాలో టిడిపికి పట్టుంది. ఈ జిల్లాలో ఎక్కువ స్థానాలను టిడిపి కైవసం చేసుకొంది. అయితే ఈ జిల్లాకు చెందిన వైసీపీకి చెందిన గుర్నాథ్‌రెడ్డి టిడిపిలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

రాజకీయ భవిష్యత్ దృష్ట్యానే గుర్నాథ్‌రెడ్డి పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే టిడిపి వైపు నుండి ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

టిక్కెట్లు విషయంతో పాటు ఇతరత్రా విషయాలపై వైసీపీ చీఫ్ జగన్ వైఖరిపై గుర్నాథ్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ కారణాలతో గుర్నాథ్‌రెడ్డి టిడిపిలో చేరాలనే యోచనలో ఉన్నారని సమాచారం.

రాజకీయ భవిష్యత్ కారణమేనా

రాజకీయ భవిష్యత్ కారణమేనా

అనంతపురం జిల్లాలో రాజకీయ భవిష్యత్ కోసం గుర్నాథ్‌రెడ్డి టిడిపిలో చేరాలనే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని టిడిపి నేతలు, మంత్రులు చెబుతున్నారు. అయితే ఏపీలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే గుర్నాథ్‌రెడ్డి టిడిపిలో చేరాలనే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు.

మిస్సమ్మ బంగ్లా కోసమేనా

మిస్సమ్మ బంగ్లా కోసమేనా


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మిస్సమ్మ బంగ్లాను గుర్నాథ్‌రెడ్డి ఆక్రమించుకొన్నారని టిడిపి, సిపిఐ, సిపిఎం ఆందోళనలు నిర్వహించాయి. అయితే ఈ బంగ్లా విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ మారాలనే ఆలోచన చేస్తున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తం చేసేవారు కూడ లేకపోలేదు.

మిస్సమ్మ బంగ్లా వ్యవహరాన్ని ప్రస్తావించిన ప్రభాకర్‌చౌదరి

మిస్సమ్మ బంగ్లా వ్యవహరాన్ని ప్రస్తావించిన ప్రభాకర్‌చౌదరి


మిస్సమ్మ బంగ్లా విషయమై అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ప్రస్తావించారు. దీంతో ఈ విషయమై సిఐడి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని గుర్నాథ్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.తన అనుచరులు, సన్నిహితులతో గుర్నాథ్‌రెడ్డి సమావేశమై పార్టీ మారే విషయమై చర్చించారని సమాచారం.

పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు

పరిటాల కుటుంబంతో సన్నిహిత సంబంధాలు

అనంతపురం నియోజకవర్గం నాయకుడిగా ఉన్న గుర్నాథ్ రెడ్డి టీడీపీలో చేరితే ఆయన కుటుంబమంతా అదేబాట పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నప్పటికి తెలుగుదేశం నేతలతో మంచి సంబంధాలే నేర్పుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నిజానికి పరిటాల రవి ఉన్నప్పటి నుంచే గుర్నాథ్ రెడ్డికి టీడీపీలో సత్సంబంధాలు ఉన్నాయి.. ప్రస్తుతం పరిటాల సునీతతో ఆయన సఖ్యతగా మెలుగుతున్నారని పార్టీ వర్గాల భోగట్టా.

English summary
There is a spreading a rumour on Anantapur Ysrcp leader Gurunath Reddy may join in Tdp. Gurunath reddy meeting with followers discussed on party change.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X