వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాల్పులు: జగన్ పార్టీ నేత మృతి, రోదనలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారి బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్‌ షోరూమ్‌లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. తన దగ్గరి బంధువు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ విషయమై వారి మధ్య వివాదం ఏర్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

సింగపూర్‌లో పనిచేస్తున్న హనుమంతురావు స్వదేశానికి వచ్చి ఐదు నెలల నుంచి నందిగామలోని శ్రీశైలవాసుకు చెందిన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆయన తన స్నేహితుడంటూ ఖాజాబాషాను షోరూమ్‌కు వెంట తీసుకువచ్చారు. శ్రీశైలవాసు తలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి, మోటారు సైకిల్‌పై పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీశైలవాసును అనుచరులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్

శ్రీశైల వాసును హత్య చేసిన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను నల్గొండ జిల్లా కోదాడ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో శ్రీశైలవాసు మేనల్లుడు అయిన హన్మంతరావు, మరొకరు ఖాజాను అరెస్ట్ చేశారు. రూ. కోటి శ్రీశైలవాసు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నందునే హన్మంతరావు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. డబ్బు కోసమే నందిగామలోని శ్రీశైలవాసు ట్రాక్టర్ ఏజెన్సీ వద్దకు వచ్చి అతనితో మాట్లాడిన అనంతరం నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. హన్మంతరావు సింగపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

మృతుడి కుటుంబసభ్యుల రోదన

మృతుడి కుటుంబసభ్యుల రోదన

వైయస్సార్ కాంగ్రెస్ నాయకుడు, వ్యాపారి బొగ్గవరపు శ్రీశైలవాసు (43) కృష్ణా జిల్లా నందిగామలో మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు. తన ట్రాక్టర్‌ షోరూమ్‌లో ఉన్న శ్రీశైలవాసును దుండగులు తుపాకీతో కాల్చి చంపారు.

మృతుడు శ్రీశైల వాసు

మృతుడు శ్రీశైల వాసు

తన దగ్గరి బంధువు, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉన్నం హనుమంతురావు వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము అప్పుగా తీసుకున్నాడని, ఈ బాకీ విషయమై వారి మధ్య వివాదం ఏర్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.

శ్రీశైల వాసు(ఫైల్ ఫొటో)

శ్రీశైల వాసు(ఫైల్ ఫొటో)

సింగపూర్‌లో పనిచేస్తున్న హనుమంతురావు స్వదేశానికి వచ్చి ఐదు నెలల నుంచి నందిగామలోని శ్రీశైల వాసుకు చెందిన గెస్ట్‌హౌస్‌లోనే ఉంటున్నారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఆయన తన స్నేహితుడంటూ ఖాజాబాషాను షోరూమ్‌కు వెంట తీసుకువచ్చారు.

రోదనలు

రోదనలు

శ్రీశైలవాసు తలపై రెండు రౌండ్లు కాల్పులు జరిపి, మోటారు సైకిల్‌పై పరారయ్యారు. రక్తపు మడుగులో ఉన్న శ్రీశైలవాసును అనుచరులు వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

English summary

 YSRCP Leader Srisailam Vasu Brutally Murdered By Son-in-law, in Nandigama, Krishna district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X